కేసీఆర్ Vs ఈటెల: రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోన్న హుజూరాబాద్‌

VUYYURU SUBHASH
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించాక ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ రెండు సార్లు సాధార‌ణ ఎన్నికలు జ‌రిగాయి. రెండు సార్లు కూడా అధికార టీఆర్ ఎస్ గెలిచింది. అయితే ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చాక కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. పాలేరు, నారాయ‌ణ్ ఖేడ్‌, దుబ్బాక‌, హుజూర్ న‌గ‌ర్‌, నాగార్జునా సాగ‌ర్ తో పాటు తాజాగా హుజూరా బాద్ సెగ్మెంట్‌కు ఉప ఎన్నిక జ‌రుగుతోంది. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల కంటే హుజూరా బాద్ అత్యంత ఖ‌రీదైన ఎన్నిక‌గా రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది.

నెల రోజులుగా హోరాహోరీగా ప్రచారంలో తలపడ్డ పార్టీలు.. మనీ పంపిణీ లోనూ పోటీ పడుతున్నాయి. సాధార‌ణంగా పంపిణ అంటే పోలింగ్ కు ముందు రోజో లేదా రెండు రోజుల ముందో ఉంటుంది. కానీ హుజూరా బాద్‌లో మాత్రం బుధ‌వారం నుంచే పంపిణీ ప్రారంభించేశారు. ఆరు నెల‌ల ముందు నుంచే కుల సంఘాల వారీగా విందులు, వినోదాల‌తో ఇక్క‌డ ఓట‌ర్ల‌ను ముంచెత్తిన అధికార టీఆర్ ఎస్ డ‌బ్బు పంపిణీ విష‌యంలో కూడా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ఓట‌ర్ల‌ను ముంచె త్తేసింది.

టీఆర్ ఎస్ బుధ‌వారం ఉద‌య‌మే పాల ప్యాకెట్లు పంచిన‌ట్టు ఏజెంట్ల‌ను రంగంలోకి దించేసి డ‌బ్బును ఇళ్ల వారీగా పంపిణీ చేసేసింది. లోక‌ల్ లీడ‌ర్లు అంద‌రూ డ‌బ్బు పంపిణీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధిష్టానం ముందే వార్నింగ్‌లు కూడా ఇచ్చింది. ఒక్కో ఓటుకు రూ. 6 వేల చొప్పున ప్యాక్ చేసి పంపిణీ చేశారు. 2018 లో తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఓటు రేటు రు. 2 వేలు గ‌రిష్టంగా ప‌లికింది. ఇప్పుడు దానికి మూడు రెట్లు హుజూరా బాద్‌లో పంచుతున్నారు.

ఇక‌ వీణవంక మండలంలో ఓటుకు రూ. 10 వేల చొప్పున ఇచ్చినట్లు టాక్‌. బీజేపీ కూడా హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలతోపాటు అన్ని రూరల్ మండలాల్లో గ‌ట్టిగానే డ‌బ్బులు పంచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: