టీఆర్ఎస్లోకి ఆర్.కృష్ణయ్య.. కేసీఆర్ బంపర్ ఆఫర్..?
టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచినా కూడా కృష్ణయ్య ఎప్పుడూ ఆ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు. ఇక గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అయితే 2019 ఎన్నికల కు ముందు మాత్రం ఆయన ఏపీలో వైసీపీని గెలిపించాలని ప్రచారం చేశారు. ఇక కొంత కాలంగా తెలంగాణ లో అధికార టీఆర్ ఎస్ కు అనుకూలం గా ఉంటూ వస్తోన్న కృష్ణయ్య ఇప్పుడు గులాబీ గూటికి చేరుకోను న్నారట. కేసీఆర్ - కృష్ణయ్య మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయని తెలుస్తోంది.
పార్టీలో చేరితే కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ చేశారట. కృష్ణయ్యతో ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ తో పాటు సీనియర్ నేత , మాజీ ఎంపీ వినోద్ కుమార్ పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు టాక్ ? ఇక ఇప్పటికే కృష్ణయ్య 120 జాతీయ బీసీ సంఘాలతో పాటు బీసీలు అందరూ కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలని చెప్పారు. ఏదేమైనా కృష్ణయ్య అధికార టీఆర్ ఎస్ కు అనుకూలంగా మారడంతో బీసీ సంఘాలు అన్ని తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఆయన తన పదవుల కోసం పలు పార్టీలు మారుతూ వస్తున్నారని వాళ్లు విమర్శిస్తున్నారు.