పెద్దన్న స్థానమనేది చైనా కల. ప్రపంచ దేశాలకు రకరకాలుగా ఇబ్బంది క్రియేట్ చేయడం, గిల్లి
పంచాయతీ పెట్టుకోవడం చేస్తుంటుంది. డ్రాగన్ ను ఏ దేశం నమ్మే పరిస్థితి లేదు. మిగతా దేశాల సంగతి తర్వాత, సరిహద్దు పంచుకునే దేశాలతో తగువు పెట్టుకోవడం ఆపే ఆలోచన కూడా డ్రాగన్ కు లేదు. కోస్ట్ గార్డ్ లా, మారిటన్ లా అంటూ దక్షిణ చైనా సముద్రాన్ని మింగేసెందుకు సిద్ధమైంది చైనా. ఇప్పుడు ల్యాండ్ బార్డర్ చట్టం పేరుతో మరో చట్టాన్ని చేసింది. సరిహద్దు దేశాలకు చైనా నుంచి పొంచిఉన్న ప్రమాదం ఏంటి..?
భారత్ మీద మరో కుట్రకు డ్రాగన్ ప్లాన్ చేస్తోందా..?
అమాయకుల ప్రాణాలను ముందు పెట్టి కుట్రల్ని కంటిన్యూ చేస్తుందా? ల్యాండ్ బార్డర్ చట్టం ద్వారా సరిహద్దు దేశాలతో పంచాయతీలను మరింత హింసాత్మకంగా మార్చాలన్నది డ్రాగన్ ప్లాన్. చైనాకు మొత్తం 22457కి. మి పొడవైన భూ సరిహద్దు ఉంది. మొత్తం 14 దేశాలతో బార్డర్ పంచుకుంటుంది.
భారత్ తో 3488కి. మి పొడవైన వాస్తవాధీన
రేఖ ఉంది. కొత్త ల్యాండ్ బార్డర్ చట్టం ప్రకారం చైనా భౌగోళిక సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీలు లేదు. ఆ చట్టం ప్రకారం సరిహద్దుల రక్షణకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవచ్చు. వీటిని రక్షించేందుకు పోరాటం కూడా చేయొచ్చు. డ్రాగన్ చట్టం అమల్లోకి వస్తే
భారత్ కు చైనా తో ఉన్న సున్నితమైన సరిహద్దుల్లోకి ఆదేశం పెద్ద ఎత్తున బలగాలను, ఆయుధాలను తరలించే ప్రమాదం ఉంటుంది.
సరిహద్దు ప్రాంతాల్లో జనాలు నివసించేలా, మౌలిక సదుపాయాలను కల్పించడం కూడా ఒకరకంగా ఆక్రమణలో భాగమే. నిజానికి మంగోలియా,
రష్యా తర్వాత చైనాకు మూడో సుదీర్ఘమైన సరిహద్దు
భారత్ తోనే నెలకొంది. ఆ రెండు దేశాల తో డ్రాగన్ కు ఎలాంటి సరిహద్దు సమస్యలు లేవు.
భారత్ తర్వాత చైనాకు భూ సరిహద్దు తగాదాలు ఉన్నది
భూటాన్ తోనే. సరిహద్దు చర్చలను స్పీడప్ చేసేందుకు చైనాతో
భూటాన్ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాది ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దీన్ని ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయకూడదని భారత ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ప్రపంచ దేశాలు ఎన్ని మందలించిన, ఎంత చీ కొట్టిన చైనా బుద్ధి మాత్రం మారదు.