ఏపీలో మ‌ళ్లీ ఎన్నిక‌లు.. బంప‌ర్ విక్ట‌రీకి జ‌గ‌న్ రెడీ...!

VUYYURU SUBHASH
రాష్ట్రంలో త్వ‌ర‌లోనే మ‌రో 12 మునిసిపాలిటీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. నెల్లూరు కార్పొరేష‌న్ స‌హా కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, జ‌గ్గ‌య్య‌పేట‌, కొండ‌ప‌ల్లి, గుర‌జాల‌, దాచేప‌ల్లి, ద‌ర్శి, బేతంచ‌ర్ల‌, క‌మ‌లాపురం, రాజంపేట‌, పెనుకొండ, గూడూరు మునిసిపాలిటీల‌కు.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానుంది. అయితే.. ఇప్ప‌టికే ఈ మునిసిపాలిటీల్లో పాగా వేసేందుకు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయి. ఇక్క‌డ నొటిఫికేష‌న్ రాగానే రంగంలోకి దిగేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయన తాజాగా కుప్పం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌ర‌ని.. టీడీపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ సాగుతోంది. ఇప్ప టికే కుప్పంలో భారీ ఎత్తున న‌ష్ట‌పోయార‌ని.. దీని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తు న్నార‌ని.. అందులో భాగంగానే కుప్పంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు చంద్ర‌బాబు వెళ్లార‌ని అంటున్నారు. వైసీపీ దెబ్బ‌తో చంద్ర‌బాబు కుప్పంలో ఇంటింటికి తిరుగుతున్నారు. టీడీపీని మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలిపించాల ని ఆయ‌న అక్క‌డ ప్ర‌జ‌ల‌కు, ఓ ట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కుజ‌రిగిన ఎన్నిక ల్లో వైసీపీనే విజ‌యం ద‌క్కించుకుంది. పంచాయ తీ కావొచ్చు.. ప‌రిష‌త్ కావొచ్చు.. ఏదైనా కూడా.. భారీ ఎత్తున విజ‌యం ద‌క్కించుకుంది. అయి తే.. ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌ను మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. రాష్ట్రంలో రాజ‌కీయ పార్టీల దూకుడు పెరిగింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇంకే ముంది.. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగిపోయింద‌ని.. తాజాగా కూడా చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీ ప్ర‌భుత్వం.. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కొంద‌రు మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అనేక ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న నేప‌థ్యంల ఖ‌చ్చితంగా ప్ర‌జ‌లు త‌మ‌వైపే ఉన్నార‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మునిసిప‌ల్ ఉప ఎన్నిక‌ల పోరు.. మ‌రోసారి ర‌స‌వ‌త్త‌రంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: