ఇక నవంబర్ 3న జిల్లాల్లో తక్కువ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కవరేజీని సమీక్షించనున్నారు ప్రధాని మోదీ ప్రస్తుతానికి, అర్హులైన లబ్ధిదారులకు మొత్తం 1,06,14,40,335 వ్యాక్సిన్ డోసులు ఇవ్వబడ్డాయి, వీటిలో గత 24 గంటల్లో 68,04,806 డోసులు ఇవ్వబడ్డాయి.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...ఇటలీ నుండి G20 సమ్మిట్ నుండి తిరిగి వచ్చిన తరువాత, ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 3 న మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దేశంలో తక్కువ COVID-19 టీకా కవరేజీని కలిగి ఉన్న జిల్లాలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రులు మన్సుఖ్ మాండవ్య, భారతీ పవార్ సమక్షంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, COVID-19 వ్యాక్సిన్ యొక్క మొదటి డోస్‌లో 50 శాతం కంటే తక్కువ కవరేజీని మరియు రెండవ డోస్ యొక్క తక్కువ కవరేజీని కలిగి ఉన్న జిల్లాలను ఈ సమావేశంలో చేర్చనున్నారు.
ఇక జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ తదితర 40 జిల్లాల జిల్లాల మేజిస్ట్రేట్లతో ప్రధాని మోదీ సంభాషించనున్నారు. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. మూలాల ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ "హర్ ఘర్ దస్తక్" రోజున ఇంటింటికీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఫ్లాగ్ చేయనున్నారు.ఇంతలో, భారతదేశం తన కోవిడ్-19 వ్యాక్సినేషన్ మార్కును 106.14 కోట్లకు అధిగమించింది. ఇక అర్హులైన లబ్ధిదారులకు మొత్తం 1,06,14,40,335 వ్యాక్సిన్ డోసులు అందించారు. వీరిలో గత 24 గంటల్లో 68,04,806 వ్యాక్సిన్ డోస్‌లను అందించడం అనేది జరుగుతుంది.ఇక దేశంలో గత 24 గంటల్లో మొత్తం 12,830 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇంకా అలాగే క్రియాశీల కేసులు దాదాపు ఒక సంవత్సరంలో కనిష్ట స్థాయికి పడిపోవడం అనేది జరిగింది.