ఆత్మార్పణ లేకపోతే రాష్ట్ర అవతరణ జరిగేదా..?
మద్రాసు ప్రెసిడెన్సీలో 40శాతం జనసంఖ్య.. 58శాతం రాష్ట్ర విస్తీర్ణంలో తెలుగు వారిదే ఉన్నా.. తమిళులు తమను చిన్నచూపుగా చూస్తున్నారని భావించారు తెలుగువారు. ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతుందని గుర్తించారు. ఆ రాష్ట్రంలో తెలుగు బిడ్డల వెనుకబాటు తనంపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా అప్పటి వార్తా పత్రికల ద్వారా తెలుగు ప్రజలలో ప్రత్యేక రాష్ట్ర కోరిక మొదలైంది. 1911వ సంవత్సరం నాటికి ప్రత్యేక రాష్ట్రంపై చర్చ కీలక దశకు చేరుకుంది. తమిళులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. పట్టాభి సీతారామయ్య అయితే ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుబట్టారు.
ఇక పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ.. అక్టోబర్ 19, 1952వ సంవత్సరంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. డిసెంబర్ 15వ తేదీన దీక్షాస్థలిలోనే ప్రాణాలు వదిలారు. దీంతో తెలుగు జిల్లాల్లో ఆందోళన చెలరేగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. మద్రాసులో ఉండే తెలుగు జిల్లాలను కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని నెహ్రూ లోక్ సభలో ప్రకటించాల్సి వచ్చింది. విభజన ప్రక్రియకు జస్టిస్ కైలాస్ నాథ్ వాంచూ ప్రత్యేక అధికారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ఆ తర్వాత రాయలసీమ ఎమ్మెల్యేలు రాజధాని విషయంలో శ్రీబాగ్ ఒడంబడికను అనుసరించాలని విన్నవించారు. కృషిక్ లోక్ పార్టీ అయితే తిరుపతిని రాజధానికి చేయాలని కోరగా.. కమ్యూనిస్టులు తిరుపతిని రాజధానిగా కోరుకన్నారు. చివరకు కర్నూలును ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా ఒప్పుకోవాల్సి వచ్చింది.