కేసీఆర్ Vs ఈటెల: హుజూరాబాద్ షా తేలేది రేపే.. ఓట్ల లెక్కింపు ఇలా...!

VUYYURU SUBHASH
కేవ‌లం తెలంగాణలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు జ‌రుగుతుంది. శనివారం పోలింగ్‌ అనంతరం ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంలకు చేరాక నేతలు విజయావకాశాలపై ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. ఈ ఉప ఎన్నికలో 86.64 శాతం ఓట్లు పోలయ్యాయని అధికారులు ప్ర‌క‌టించారు. గ‌తంలో ఏ ఉప ఎన్నికలో ఇంతటి భారీ పోలింగ్‌ నమోదవలేదు... దీంతో ఇక్క‌డ ఓట‌రు ఎవ‌రికి ప‌ట్టం క‌ట్టారు ? అన్న‌ది ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్ గా ఉంది.

ఈ ఉప ఎన్నిక‌ల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే వీరిలో ప్ర‌ధాన పోటీ  గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ (టీఆర్‌ఎస్‌) - ఈటల రాజేందర్‌ (బీజేపీ) - బల్మూరి వెంకట్‌(కాంగ్రెస్‌) అ మధ్య నెలకొంది. మిగిలిన ఇండిపెండెంట్లు ఎవ్వ‌రి ప్ర‌భావం లేద‌నే చెప్పాలి. ఈ మూడు పార్టీల నేత‌లు పోటీ లో ఉన్నా కూడా టీఆర్‌ఎస్‌– బీజేపీ మధ్య నువ్వా–నేనా అన్న రేంజ్ లో పోటీ జ‌రిగింది.

ఇక ఎవ‌రికి వారు త‌మ‌కు అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ జ‌రిగింద‌ని చెపుతున్నారు. అయితే సైలెంట్ ఓట‌ర్లు ఎవరిపక్షం వహించారన్నదే మిలియన్‌డాలర్ల ప్రశ్న.. ఈ ఓటింగే ఇప్పుడు అభ్య‌ర్థుల జాత‌కాల‌ను తారు మారు చేయ‌నుంది. ఇక ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్ర‌మైన క‌రీంన‌గ‌ర్ లో జ‌ర‌గ‌నుంది. ఉద‌యం 8 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. అత్యంత ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది.

ఈ ఓట్ల లెక్కింపు న‌కు సంబంధించి ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రౌండ్ల వారీగా ఫ‌లితాలు లెక్కిస్తారు. ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ త‌ర్వాత ఈ వీఎంల కౌంటింగ్ ఉంటుంది. ఉద‌యం 10 గంట‌ల‌కే ట్రెండ్స్ తెలిసి పోతాయి. అయితే తుది ఫ‌లితం వెల్ల‌డి అయ్యేందుకు మ‌ధ్యాహ్నం 2 గంట‌లు దాటు తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: