బద్వేల్ ఉపఎన్నిక ఫలితాలు పూర్తయ్యాయి.
హుజురాబాద్ ఉప ఎన్నిక పై దేశమంతా ఎంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇందులో ఒకటి కాదు రెండు కాదు 22 రౌండ్ లకు పైగా లెక్కింపు ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రతి రౌండ్లోనూ
భారతీయ జనతా పార్టీ లీడింగ్ కొనసాగిస్తూ వస్తుంది. ఒక ఎనిమిదో రౌండ్ లో మాత్రం టిఆర్ఎస్ అధినేత కొనసాగించింది. ఎందుకంటే అక్కడ
కౌశిక్ రెడ్డి సొంత గ్రామం సొంత మండలం కాబట్టి. ఏది ఏమైనా ఇంత కాంపిటీషన్ లో కూడా బిజెపి టిఆర్ఎస్ కంచుకోటలో కూడా ఆదిక్యత కొనసాగిస్తూ వచ్చింది. ఎనిమిదో రౌండ్ లో వచ్చేసరికి 162 ఓట్లతో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు
శ్రీనివాస్ ఆదిత్య సాధించారు.
కానీ ఈటెల రాజేందర్ మాత్రం
తెరాస పార్టీ పై ఇప్పటికే 3200 పైగా లీడింగ్లో ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే
తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువగా వీణవంక మండలం పైనే ఆశలు పెట్టుకుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మండలం నుంచి పాడి
కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాసులు ఉన్నారు. అయితే ఈ ఓట్లు పూర్తిగా
తెరాస వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉందని వారి నమ్మకం. ఏది ఏమైనా దుబ్బాక ఎలక్షన్ లో కూడా ఎనిమిది, తొమ్మిది, పది రౌండ్లు టిఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. తర్వాత మళ్లీ
బీజేపీ దూసుకెళ్లింది. అయితే హుజురాబాదులో కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం
హుజురాబాద్ చూసుకుంటే ఈటెల ను
పార్టీ నుంచి బయటకు తరిమేశారు అనే సెంటిమెంట్ హుజురాబాదులో వర్కౌట్ అయిందని చెప్పవచ్చు.
ఏది ఏమైనా ఇంకా లెక్కించాల్సి ఉంది కాబట్టి ఇప్పుడే ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కష్టం. ఇప్పటికే 8 రౌండ్ లు పూర్తయి తొమ్మిదవ రౌండు కొనసాగుతోంది. ఇందులో 100 బూతు అయినా గెల్లు
శ్రీనివాస్ సొంత ఊరు హిమ్మత్
నగర్ లో కూడా
బిజెపి ఆధిక్యత కొనసాగించింది. ఏది ఏమైనా రెండు పార్టీల మధ్య ఓట్ల లెక్కింపు అనేది చాలా హోరాహోరీగా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఇంకా 12 రౌండ్లు మిగిలి ఉండగానే
బిజెపి పార్టీ 3000 లీడింగ్ కొనసాగిస్తూ వస్తోంది.