కేసీఆర్ Vs ఈటెల:కేసీఆర్ కు ఇవే లాస్ట్ ఎన్నికలా...? తెరాస చీఫ్ ఎవరు...?
టీఆర్ఎస్ పార్టీలో త్వరలో ముసలం పుట్టబోతున్నది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్ గౌరవంగా తప్పుకుంటే మంచిది అని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజలకు ఇకముందు కేసీఆర్ తో పనిలేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉద్దేశపూర్వకంగా తెలంగాణ లో పనిచేయడం లేదు అని స్పష్టం చేసారు. కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ఫలితాలు చెంపపెట్టు అని అన్నారు. రేపటి నుండి తెలంగాణ లో అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అని ఆయన తెలిపారు.
అన్ని వర్గాలకు కూడా దళితబంధు లాంటి పథకాలను అమలు చేసేవరకు బిజెపి పోరాటాన్ని కొనసాగిస్తాము అని స్పష్టం చేసారు. అవినీతి సొమ్ముతో హుజూరాబాద్ ఎన్నికల గెలవాలనుకున్న కేసీఆర్ కు ప్రజలు సరియైన గుణపాఠం చెప్పారు అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో హుజూరాబాద్ చివరి ఎన్నికలు అని త్వరలో కేటీఆర్ టీఆర్ఎస్ పగ్గాలు చేపట్టనున్నారు అని ఆయన పేర్కొన్నారు. అందరికన్నా కేసీఆర్ ను ఆయన కొడుకు కేటీఆర్ వెన్నుపోటు పొడుస్తారు అని హెచ్చరించారు. దేశంలో అత్యంత ఖరీదయినవి హుజూరాబాద్ ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కి సిగ్గుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని ఆయన కోరారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టే దేశ ప్రధాని , దేశ హోం మంత్రి ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు అన్నారు.