ఠాగూర్ స్ట్రాంగ్ వార్నింగ్..! అలా చేస్తే వేటు తప్పదంటూ..!

NAGARJUNA NAKKA
హుజూరాబాద్ ఉపఎన్నిక ఓటమిపై కాంగ్రెస్ అంతర్మథనం స్టార్ చేసింది. ఈ మేరకు సీనియర్ నాయకులతో ఓ కమిటీ వేసింది. ఓటమికి గల కారణాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం టాగూర్ ఆదేశించారు. అటు పార్టీ నాయకుల్లో క్రమశిక్షణ లోపించిందని మధుయాక్షి గౌడ్ అన్నారు. ఎంత పెద్ద నాయకుడైనా.. పార్టీ లైన్ లో మాట్లాడాలని స్పష్టం చేశారు. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు.

అంతేకాదు 2023 జరిగే ఎన్నికలే లక్ష్యంగా సిద్ధమవుతున్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్కం టాగూర్ తెలిపారు. ఈ మేరకు ఈ నెల 14 నుంచి 21వరకు 33జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని చెప్పారు. నాయకులు వారి జిల్లాల్లో దాదాపు 2వేల 300కిలోమీటర్ల మేర ప్రజాచైతన్య యాత్రలు నిర్వహించి సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు.

ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ నేత జగ్గారెడ్డి స్పందించారు. హుజూరాబాద్ కు సూపర్ స్టార్లు వెళ్తేనే ఓట్లు పడటం లేదు. తాను వెళ్తే ఓట్లు పడతాయా..? మాణిక్కం ఠాగూర్ కు ఏం తెలియదు. వాస్తవాలు చెబితే తనపై నిందలు వేస్తారని చెప్పారు. నిజం చెబితే నేరమన్నట్టుగా తప్పుబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి మాట్లాడకపోవడమే మంచిదని పిస్తుందని చెప్పారు జగ్గారెడ్డి. ఇకపై అంతర్గత వ్యవహారాలపై మాట్లాడనని చెప్పారు. షోకాజ్ నోటీస్ ఇస్తారేమో చూద్దామంటున్నారు.

హోరాహోరీగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించగా.. అధికార టీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితం అయింది. అయితే రాష్ట్రంలో విపక్ష హోదా కలిగిన కాంగ్రెస్ మాత్రం కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. మొత్తం ఓట్లలో ఆయనకు కేవలం 3వేల 12ఓట్లే వచ్చాయి. అయితే ఈ ఉపఎన్నిక టీఆర్ఎస్-ఈటల మధ్యే సాగడంతో కాంగ్రెస్ ను ఓటర్లు పట్టించుకోలేదు.








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: