తెలుగు అకాడమీ నిధులు గోల్ మాల్ తో అప్రమత్తం అయ్యారు అధికారులు పోయిన డబ్బులు రాబట్టు కుంటాం.. వాటిని చెల్లించాల్సిన బాధ్యత బ్యాంక్ లదే . ..ఆ డబ్బులు ఇచేందుకు ఒప్పుకున్నాయని స్పష్టం చేశారు విద్యా శాఖ అధికారులు. అకాడమీ డబ్బులను ఎక్కువ బ్యాంక్ లలో పెట్టడం , తక్కువ తక్కువ అమౌంట్ లు ఎఫ్ డి చేయడం కూడా కరెక్ట్ కాదన్నారు విద్యా శాఖ అధికారులు. ఆ డబ్బులు మావే అన్నట్టుగా కొన్ని తెలుగు అకాడమీ లాంటి సంస్థలు భావిస్తున్నాయని తెలిపారు విద్యా శాఖ అధికారులు.
వివిధ బ్యాంకుల్లో ఉన్న ఎఫ్ డి లను క్లోజ్ చేస్తామని... ఆ డబ్బులన్ని తీసుకొచ్చి ఒకే సేవింగ్ అకౌంట్ లో జమ చేస్తాం... లీడ్ బ్యాంక్ sbi లో పెడతామని స్పష్టం చేశారు విద్యా శాఖ అధికారులు. ఎక్కడెక్కడ డిపాజిట్ చేశారు... ఎన్ని నిధులు ఉన్నాయనే దాని పై ఆడిటింగ్ డిపార్ట్మెంట్ ఆడిట్ చేస్తోందని వెల్లడించారు విద్యా శాఖ అధికారులు. ఫిక్స్డ్ డిపాజిట్ విషయం పై ఆర్థిక శాఖ కూడా సీరియస్ గా ఉందన్నారు విద్యా శాఖ అధికారులు.
అన్ని ప్రభుత్వ విభాగాలకు స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఆర్థిక శాఖ జారీ చేయనున్నట్లు తెలిపారు విద్యా శాఖ అధికారులు. బ్యాంకర్స్ కమిటీ మీటిం గ్ లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు విద్యా శాఖ అధికారులు. కాగా.. తెలుగు అకాడమీ నిధులు గోల్ మాల్ కేసులో ఇప్పటికే పలు గు రు అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు లో ఉంది. తెలుగు అకాడమీ నిధులు గో ల్ మా ల్ కే సు లో రో జు ములుపు తో పాటు ట్విస్ట్ చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.