గుడ్ న్యూస్.. మరింత తగ్గనున్న ధరలు?
అయితే ముఖ్యంగా ప్రస్తుతం ఉల్లి ధరలు అందరిని కన్నీరు పెట్టిస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటివరకు వందకి నాలుగు కిలోల వరకూ వచ్చిన ఉల్లి ఇక ఇప్పుడు కిలో బారీగా రేటు పెరిగింది. దీంతో సామాన్య ప్రజలకి ఉల్లి ధర మరోసారి కన్నీళ్లు తెప్పిస్తోంది. దీంతో మరోసారి ఉల్లి లేకుండానే వంటలు కానిచ్చేస్తున్నారు సామాన్యులు. ఇప్పటికే కూరగాయల ధరలు భారీగా పెరిగి పోగా అటు ఉల్లి ధరలు కూడా ఒక్కసారిగా పెరగడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఉల్లి ధరలు తగ్గుతాయ్ ఏమో అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
అయితే ఉల్లి ధరల విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గిడ్డంగుల్లో ఉన్న బఫర్ స్థాక్ సరఫరా వల్ల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటివరకు 1.11 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఢిల్లీ, కోల్ కత్తా, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన మార్కెట్లకు సరఫరా చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో కిలో ఉల్లి ధర 5 రూపాయల నుండి 12 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కొన్ని ప్రాంతాలలో కిలో ఉల్లి ధర 40 రూపాయలకు పైగానే పలుకుతూ ఉండడం గమనార్హం.