ఎన్టీఆర్ త‌ర్వాత జ‌గన్‌కే ఆ రికార్డు..!

VUYYURU SUBHASH
ఏపీలోని ఉత్తరాంధ్రా జిల్లాలు మూడు వెనకబడినవే అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఈ మూడు జిల్లాల్లోనూ శ్రీకాకుళం జిల్లా అయితే ఈ రోజుకీ అన్ని విధాలుగానూ అట్టడుగున ఉంద‌ని ప‌లు నివేదిక‌లు చెపుతున్నాయి. సాగు నీరు స‌రిగ్గా ఉన్నా కూడా వాడుకునే ఇది లేదు. ఇక ఈ జిల్లా నుంచే పెద్ద ఎత్తున వ‌ల‌స‌లు ఉంటాయి. ఈ జిల్లా లోనే నాగావ‌ళి తో పాటు వంశ‌ధార అనే రెండు పెద్ద న‌దులు ఉన్నాయి. ఇందులో వంశధార అద్భుతమైన జీవనది. అయితే ఇది ఒడిషా రాష్ట్రంతో వాటా కలిగి ఉండ‌డంతో చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. అనేక చిక్కులూ ... చికాకులు వస్తున్నాయి.
దీంతో పాటు శ్రీకాకుళం ... విజయనగరం జిల్లాలకు ఒడిషాతో దశాబ్దాల తరబడి చాలా స‌రి హ‌ద్దు వివాదాలు ఉన్నాయి. వీటిని ప‌రిష్క‌రించుకు నేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ముఖ్య‌మంత్రి కూడా దీనిపై కాన్ సంట్రేష‌న్ చేయ‌లేదు. అయితే ఇందు కోస‌మే జ‌గ‌న్ ఈ నెల 9న ఒడిషా టూర్ వెళుతున్నారు. జ‌గ‌న్ ఈ టూర్ లో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో ఆయన ముఖా ముఖీ చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్నారు.
ఈ క్ర‌మంలోనే శ్రీకాకుళం జిల్లా లో వంశ‌ధార న‌ది మీద నిర్మించే నేరేడు బ్యారేజ్ విషయంలో ఒడిషా అభ్యంతరాలకు జ‌గ‌న్ క్లారిటీ ఇస్తార‌ని అంటున్నారు. అదే జ‌రిగితే శ్రీకాకుళం జిల్లాకు చాలా వ‌ర‌కు సాగు, తాగు నీటి విష‌యంలో న్యాయం జ‌రుగుతుంది. ఇక విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కొటి యా గ్రామాలు 21 వ‌ర‌కు ఉన్నాయి. వీటి విష‌యంలో కూడా ఒడిశాతో పంచాయితీ న‌డుస్తోంది. దీనిని కూడా జ‌గ‌న్ ప‌రిష్క‌రిస్తారట‌.
ఇక గ‌తంలో ఎన్టీయార్ తరువాత మరే ముఖ్యమంత్రి ఒడిషా వెళ్లి చర్చలు జరపలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల‌కు జ‌గ‌న్ ఆ రికార్డును చేరుకోబోతున్నారు. మ‌రి జ‌గ‌న్ చ‌ర్చ‌లు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: