అక్కడ టీడీపీకి క్యాండెట్లను పెట్టే దిక్కే లేదా..?
దీనిపై మంత్రి అనిల్ ఈ రోజు స్పందించారు. కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ కి అభ్యర్థులను పెట్టుకునే దిక్కు కూడా లేదు.. అందుకే అనైతిక పొత్తులకు వెంపర్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాము కార్పోరేషన్ పరిధిలో ఉన్న 54 డివిజన్లలోనూ గెలుస్తున్నామని చెప్పారు. ఇక 40 డివిజన్లలో అసలు టీడీపీ తరపున పోటీ చేసేందుకు కార్పోరేటర్ అభ్యర్థులే లేని దుస్థితి లో ఆ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు.
అసలు టీడీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు బతిమి లాడుకుంటోన్న పరిస్థితి ఉందన్నారు. ఆ పార్టీకి పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడతోనే అనైతిక పొత్తులకు దిగుతున్నారంటూ అనిల్ మండి పడ్డారు. చివరకు సిపిఎంతో చర్చలు విఫలం అయ్యాయని.. సీపీఐకి ఒక సీటు కేటాయించారని ... టీడీపీ దిగజారుడుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.
ఇక జనసేన తో చర్చలు జరపడం కూడా నీచమైందే అన్నారు. సరే మంత్రి అనిల్ మాటలు ఎలా ఉన్నా కూడా నెల్లూరు కార్పోరేషన్ పరిధిలో టీడీపీ క్యాండెట్లు కూడా బలమైన వాళ్లు లేన స్థాయికి అయితే పడిపోయినట్టే కనిపిస్తోంది. కార్పోరేషన్ పరిధిలో నెల్లూరు సిటీ తో పాటు నెల్లూరు రూరల్ నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఎమ్మెల్యే క్యాండెట్లు కూడా టీడీపీకి బలమైన వాళ్లు లేరు.