వామ్మో.. అమెజాన్ లో కవర్ ఆర్డర్ చేస్తే.. పాస్పోర్ట్ వచ్చింది?
ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఆన్లైన్ ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఇటీవలి కాలంలో ఆన్లైన్ లో కొన్ని చిత్రవిచిత్రమైన ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక వినియోగదారుడు తనకు కావలసిన వస్తువులు ఆర్డర్ చేస్తే ఊహించని విధంగా మరో ఐటం డెలివరీ కావడం లాంటి వి కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఇలా ఆన్లైన్లో డెలివరీ జరిగిన సమయంలో మోసాలు కూడా జరుగుతూ వుండడం చూస్తూ వుంటాము. కాని ఇక్కడ మాత్రం ఊహించని చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ లో ఒకటి ఆర్డర్ పెడితే చివరికి వచ్చింది మాత్రం మరొకటి.
కేరళలో ఒక వ్యక్తి అమెజాన్ వేదికగా పాస్పోర్ట్ కవర్ ఆర్డర్ చేశాడు. ఇక ఆ తర్వాత అమెజాన్ చెప్పినట్టే పాస్పోర్ట్ కవర్ డెలివరీ చేసేది. కానీ సదరు కస్టమర్ మాత్రం షాక్ అయ్యాడు. ఎందుకంటే అమెజాన్ డెలివరీ చేసిన ప్యాకెట్ లో పాస్పోర్ట్ కవర్ తో పాటు ఏకంగా పాస్పోర్ట్ కూడా వచ్చేసింది. ఇది కాస్తా సంచలనంగా మారిపోయింది. వాయనాడ్ కు చెందిన మిథున్ బాబు అనే వ్యక్తి పాస్పోర్ట్ కవర్ ఆర్డర్ చేయగా.. అతనికి కవర్ తో పాటు ఒరిజినల్ పాస్పోర్ట్ కూడా వచ్చింది. అయితే ఈ పాస్ పోర్ట్ తిరువూరు కు చెందిన సలేహ్ అనే వ్యక్తిగా గుర్తించారు. అయితే ఈ విషయాన్ని అమెజాన్ కు ఫిర్యాదు చేయడంతో ఇక సంస్థ క్షమాపణలు చెప్పింది. కాగా ఈ ఒరిజినల్ పాస్పోర్ట్ ఎలా వచ్చింది అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.