యాత్రకు నాలుగేళ్లు: జగన్ అప్పుడే పసిగట్టేశాడు...!
తను అధికారంలోకి వస్తే వ్యవస్థల ను సమూలంగా ఎలా ? ప్రక్షాళన చేయాలో ముందుగానే గ్రహించారు. ఈ క్రమంలోనే ప్రజా సంకల్ప యాత్ర చేయడం ద్వారా జగన్ కు ప్రజల ఇబ్బందులు తెలుసు కునే అవకాశం కలిగింది. అలాగే మరో ప్లస్ పాయింట్ కూడా ఈ యాత్రలోనే ఉంది. ప్రజల్లో ఎవరైతే బలమైన అభ్యర్థులు గా ఉన్నారు ? నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి... నియోజకవర్గంలో ఎవరికి టిక్కెట్ ఇస్తే పార్టీ గెలుస్తుంది అన్నదానిపై ఆయనకు సమగ్రమైన అవగాహన ఏర్పడింది.
ఇదే ఎన్నికలకు ముందు ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ అలాంటి అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం ద్వారా జగన్ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే ఎవరు కానీ వినీ ఎరుగని రీతిలో ఏకంగా 151 సీట్లు వైసీపీకి వచ్చాయి. ఇక జగన్ చేసిన మరో మంచి పని ఏంటంటే నాడు తనకు యువత లో ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యక్షంగా చూశారు.
అందుకే ఎన్నికల్లో సీనియర్ల లో చాలా మందిని పక్కన పెట్టేసి చాలా మంది యువ నేతలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇది కూడా యువత లో జగన్ పట్ల క్రేజ్ మరింత పెరగడానికి కారణమైంది. అందుకే ఇప్పుడు వైసీపీ లో యువ నేతలే ఎక్కువ మంది ఉన్నారు.