ఆళ్ల‌ను జ‌గ‌న్ అందుకే ప‌క్క‌న పెట్టారా ?

VUYYURU SUBHASH
గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి కూడా మంత్రివర్గంలో చోటు దక్కడం కష్టంగానే ఉంద‌ని ఆ పార్టీ నేత‌లే చెవులు కొరుక్కుంటున్నారు. ఇందుకు చాలా కార‌ణాలే క‌నిపిస్తున్నా.. ప్ర‌ధాన కార‌ణం మాత్రం ఆయ‌న‌కు కుల మే ప్ర‌ధాన అడ్డంగా మారింద‌ని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే రాజ‌ధాని జిల్లా లు అయిన గుంటూరు - కృష్ణా జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గానికి మంత్రి వర్గంలో ఛాన్స్ ఉండ‌ద‌న్న కొత్త విశ్లేష‌ణ‌లు స్టార్ట్ అయ్యాయి . ఈ రెండు జిల్లా ల నుంచి కొత్త కేబినెట్లో కూడా కమ్మ, ఎస్సీ, కాపుల వంటి వారినే జగన్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతన్నారు.

ఇక మ‌రో అడ్డంకి కూడా ఆళ్ల‌కు ఉంది. అదేంటంటే ఆయ‌న  సోదరుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి  రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో లోకేష్ మీద ఆళ్ల పోటీ చేసిన క్ర‌మంలో లోకేష్ పై గెలిస్తే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పారు. అయితే ఆ త‌ర్వాత ఈక్వేష‌న్లు మారిపోయాయి. ఆయ‌న సోదరుడు అయోధ్య రామిరెడ్డికి రాజ్య‌స‌భ ఇచ్చారు. మ‌రో వైపు ఆళ్ల కు కూడా త‌న‌కు ఈ సారి అయినా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌లు పోతున్నాయి.

అయితే ఆళ్ల అనుచ‌రులు మాత్రం జ‌గ‌న్ త‌మ నేత‌కు ఇచ్చిన హామీ ప్ర‌కారం ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిందే అని ప‌ట్టు బ‌డుతున్నారు. అయితే జిల్లాలో చాలా మంది సీనియ‌ర్లు మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నారు. వీరిలో క‌మ్మ వ‌ర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ స్వ‌యంగా హామీ ఇచ్చారు. ఇక మ‌ర్రి తో పాటు అంబటి రాంబాబు - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - ముస్తాఫా మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నారు. ఏదేమైనా ఆళ్ల కు జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి హామీ ఇచ్చి కూడా ప‌ద‌వి ఇవ్వ‌లేని విచిత్ర ప‌రిస్థితి నెల‌కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: