అడ్డంగా దొరికిపోయిన పల్లె రఘునాథ్ రెడ్డి..!

NAGARJUNA NAKKA
టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నిజ స్వరూపం బయటపడింది. వైపీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించేందుకు ఆయన చేసిన ప్రయత్నం బట్టబయలైంది. అంగన్ వాడీ కార్యకర్తను అందుకు ఉసిగొల్పిన విషయం తెలిసిపోయింది. అంగన్ వాడీ కార్యకర్త సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాకు ఎక్కితే అంతా వణికిపోతారని సలహా ఇచ్చారు. అధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై వేధింపుల కేసు పెట్టాలని ఆమెకు సూచించారు.

అంతేకాదు ఆ తర్వాత సీఎం జగన్ కు పంపేందుకు ఒక వీడియో కూడా రూపొందించాలని ఆ అంగన్ వాడీ కార్యకర్తకు సలహా ఇచ్చారు పల్లె రఘునాథ్ రెడ్డి. జగన్ మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని.. అయితే ఒకవ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్న విషయం సీఎంకు వీడియో కాల్ ద్వారా చెప్పాలని సలహా ఇచ్చారు. లొంగక పోతే కేసు పెడతారని బెదిరించారని అందులో మాట్లాడాలని చెప్పారు. దయచేసి రక్షణ కల్పించాలని సీఎంకు విన్నవించుకోవాలని ఆమెకు చెప్పారు. సీఎం గారూ.. మీరే ఆదుకోవాలని వేడుకోవాలని సలహా ఇచ్చారు. సీఎం చొరవ తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ వీడియో తయారు చేయాలని పల్లె రఘునాథ్ రెడ్డి మహిళకు సూచించారు. అలా చేస్తే ఫిర్యాదు చేసిన వ్యక్తే.. తన కాళ్ల బేరానికి వస్తాడని చెప్పారు.

ఆ అంగన్ వాడీ కార్యకర్త రూపొందించే వీడియోలో మొత్తం... దుర్భాషలు, లైంగిక వేధింపులు..అసభ్య చూపులు లాంటివి గట్టిగా ప్రస్తావిస్తూ ఆ వ్యక్తిపై సీఎంకు ఫిర్యాదు చేయాలని సూచించారు పల్లె రఘునాథ్ రెడ్డి. లేక పోతే ఆత్మహత్య చేసుకుంటా.. దయచేసి నాకు రక్షణ కల్పించండని వేడుకోవాలని చెప్పారు. అని వీడియో రూపొందించి.. వైరల్ చేయాలని చెప్పారు. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా కంప్లైంట్ చేయాలని చెప్పారు.

ఈ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించేందుకు ఒక మహిళను వాడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: