కొడుకు పెళ్లి.. తల్లి మరణం.. అతని గుండె కూడా ఆగింది..!
కుమార్తెలిద్దరూ పెద్దవారు.. ఇప్పటికే వారి పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు కుమారుడు గోవర్థన్ వివాహం చేస్తున్నారు. నిన్ననే కుమారుడు గోవర్ధన్ వివాహం జరగింది. అయితే.. ఏఎస్సై వెంకటస్వామి తల్లి కోన్నమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆమె పరిస్థితి కాస్త ఆందోళన కరంగా ఉంది. ఆమెను అనంతపురంలోని ఓ వైద్యశాలలో ఉంచి మూడు రోజుల నుంచి చికిత్స అందిస్తున్నారు.
తల్లంటే విపరీతమైన ప్రేమ ఉన్న ఏఎస్సై వెంకటస్వామి.. ఆమె అనారోగ్యం గురించి ఎంతగానో దిగులు చెందారు. కానీ.. ముందుగా అనుకున్న ముహూర్తం కావడం వల్ల దిగులుతోనే.. కుమారుడు గోవర్థన్ వివాహాన్ని జరిపించారు. అలా ఓవైపు పెళ్లి కార్యక్రమం ముగిసింది. ఆ కాసేపటికే అనంత పురం ఆస్పత్రిలో ఉన్న వెంకట స్వామి తల్లి కోనమ్మ కన్నుమూశారు. ఆమె మరణ వార్తను బంధువులు ఫోన్ ద్వారా వెంకట స్వామికి తెలిపారు. ఆమె మరణ వార్త విన్న వెంకట స్వామి ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు.
విపరీతమైన షాక్తో ఆయన గుండె ఆగి పోయింది. బంధువులు వెంకట స్వామిని హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అలా పెళ్లింట్లో పెను విషాదం నిండింది. ఓవైపు తన వివాహం పూర్తయిన కాసేపటికే నానమ్మ, తండ్రి మరణించడంతో పెళ్లింట్లో అంతా విషణ్ణ వదనలయ్యారు. తల్లి మరణ వార్త విని షాక్తో మరణించిన ఏఎస్సై ఉదంతం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.