బీజేపీ గెలుపు సెగ కేసీఆర్ కు బాగా తగిలిందా..? డీకే అరుణ వ్యాఖ్యలు చూస్తుంటే..!

NAGARJUNA NAKKA
కమలం పార్టీపై కేసీఆర్ విరుచుపడిన కారణంగా ఆ పార్టీ నేత డీకే అరుణ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు సెగ కేసీఆర్ కు బాగా తగిలినట్టుందన్నారు అరుణ. ఆ ఫలితం చూసి దిమ్మతిరిగిందని వ్యాఖ్యానించారు. గతంలో ప్రత్యేక రాష్ట్రం అవసరాన్ని గుర్తించిన ప్రజలు కేసీఆర్ ను గెలిపించారనీ.. తాజా ఉపఎన్నిక ఆయన కళ్లు తెరిపించిందని అన్నారు. దీంతో ఇప్పుడు సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.
అంతకుముందు బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే చెబుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నిన్న ప్రెస్ మీట్ లో కేసీఆర్ గంటపాటు అబద్దాలు చెప్పారనీ.. ఈ అబద్దాలు చెప్పేందుకే ఆయన ప్లీనరీలు, బహిరంగ సభలు, కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా సీఎం రుణమాఫీ చేయలేదన్న సంజయ్.. రైతులు ఎక్కడ కార్లలో తిరుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్ధిపేటలోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఒకసారి వరి వేయెద్దని, ఇంకోసారి పత్తి వేయొద్దని రైతులను ముఖ్యమంత్రి ఆగం చేశారని విమర్శించారు. 62లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారని కేసీఆర్ అంటున్నారన్న సంజయ్.. దీనిపై నిపుణులతో కలిసి హెలికాప్టర్ లో పరిశీలిద్దామా.? అని సవాల్ విసిరారు.
ఇక తెలంగాణలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచలేదని కేసీఆర్ అబద్దాలు చెప్పారని.. 2015లో పెట్రోల్ పై 4శాతం, డీజిల్ పై 5శాతం వ్యాట్ పెంచలేదా..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. వ్యాట్ అత్యధికంగా విధించే రాష్ట్రాల్లో తెలంగాణ రెండవ స్థానంలో ఉందనీ.. సీఎం స్థాయి వ్యక్తి ఇలా అబద్దాలు చెప్పొచ్చా అని అన్నారు. 24రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే.. 5కేసీఆర్ ఎందుకు తగ్గించరని.. లీటర్ పై కేంద్రానికి 27రూపాయలు వస్తే.. రాష్ట్రానికి 28రూపాయల పన్ను వస్తోందన్నారు. మొత్తానికి బీజేపీ నేతలు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రికి.. బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: