చిన్నారుల కరోనా టీకా.. ధర ఎంతో తెలుసా?
ఇక కేంద్ర ప్రభుత్వం అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా ప్రజలకు వ్యాక్సిన్ అందించే ప్రక్రియను కొనసాగిస్తున్నాయి అటు జనాలు కూడా వ్యాక్సిన్‌పై పూర్తి స్థాయి అవగాహన పెంచుకుని స్వచ్ఛందంగా టీకా వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం చిన్నపిల్లల వ్యాక్సిన్ విషయంలో గత కొంత కాలం నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో పలు రకాల టీకాలు కూడా చిన్న పిల్లల కోసం అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్నారుల కోసం జోడాస్ కాడిలా రూపొందించిన జైకోవ్ డి అనే కరోనా టీకాను త్వరలో కేంద్రం అందుబాటులోకి తీసుకు రాపోతున్నట్లు తెలుస్తోంది.
అయితే కరోనా టీక ఒక్క డోస్ ధరను నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఒక్క డోస్ టీకా కోసం 265 రూపాయలు చెల్లించనున్నట్లు తెలుస్తోంది.. అయితే చిన్నారులకు అందించే ఈ టీకా ఎలాంటి ఇంజక్షన్ లేకుండానే పంపిణీ చేయనున్నారు. ఇక దీని కోసం ఒక ప్రత్యేక పరికరాన్ని వాడుతున్నారు. ఇక దీని ధర 93 రూపాయలు ఉంటుంది. ఇలా ఒక్కో డోస్ ధర 358 రూపాయలు అవుతుందని ఇక జోడస్ కాడిలా తెలిపింది. దేశంలో పన్నెండేళ్ల వయసు పైబడినవారు అందరికీ కూడా ఇక ఈ టీకా వేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.