ఆఫ్ఘనిస్థాన్లో దయనీయం.. కన్న కూతుర్లనే అమ్ముకుంటున్నారు?

praveen
ఆఫ్గనిస్థాన్ దేశం  తాలిబన్ల చేతిలో కి వచ్చిన తర్వాత అక్కడ పాలన మొత్తం అస్తవ్యస్తం గా మారిపోయింది అన్నది ప్రపంచం ఎదిగిన నిజం. అయితే ఇక ఆప్ఘనిస్థాన్లో తాలిబన్లు పాలన మొదలు పెట్టిన తర్వాత ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ తో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకున్నాయి. దీంతో ఇక ఆఫ్ఘనిస్తాన్ మొత్తం రోజురోజుకు సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రస్తుతం అక్కడ అన్ని రకాల సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి. దీంతో దేశంలో ప్రజల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారిపోతుంది. ఇప్పటికే నిధుల కొరత ఆఫ్ఘనిస్తాను ఎంతగానో వేధిస్తూ ఉండగా ఆహారపు కొరత కూడా ఏర్పడుతుంది.


 అయితే ఇక అటు ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు ఇవేవీ పట్టవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలను బానిసలుగా చూడటం తప్ప ప్రజల బాగోగుల గురించి అసలు ఆలోచించడంలేదు. దీంతో పరిస్థితులు రోజురోజుకు చేయి దాటిపోతున్నాయి అని చెప్పాలి. అయితే కెనడాకు చెందిన ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ రైడ్స్ అండ్ సెక్యూరిటీ అనుకున్న ప్రకారం 95 శాతం మంది ప్రజలకు అఫ్గానిస్థాన్లో ఇప్పటికి కూడా సరైన తిండి లేని పరిస్థితి ఉందని ఇక రానున్న రోజుల్లో ఆప్ఘనిస్థాన్లో ఆకలిచావులు కూడా కనిపించబోతున్నాయని అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఆప్ఘనిస్థాన్లో ఎంతటి దారుణమైన దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి అన్న దానికి ఇక్కడ ఒక తండ్రి చేసిన పనే అద్దం పడుతుంది అని చెప్పాలి.


 ఆఫ్ఘనిస్థాన్లో నార్త్వెస్ట్ ప్రావిన్స్ లో అబ్దుల్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ప్రస్తుతం అతనికి ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడింది. అతని భార్య రోజంతా పనిచేసినా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. దీంతో ఎన్నో రోజుల నుంచి ఒక పూట తింటే ఇంకో పూట పస్తులు ఉంటూనే వస్తుంది ఆ కుటుంబం. చివరికి ఇటీవలే అబ్దుల్ ఏకంగా కుటుంబ సభ్యుల కడుపు నింపడానికి కన్నకూతుర్ని అమ్ముకోవడానికి సిద్ధమయ్యాడు. కొన్ని నెలల క్రితం 12 ఏళ్ళ కూతురునీ ఒక 55 ఏళ్ల వ్యక్తికి అమ్మేశాడు అబ్దుల్. వచ్చిన డబ్బుతో ఇక భార్య కూతురు సహా మరికొంత మంది కుటుంబ సభ్యుల కడుపు నింపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక కుటుంబ సభ్యుల కడుపు నింపాలంటే వేరే దారి లేదు అంటూ చెప్పుకొచ్చాడు తండ్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: