డిజప్పాయింట్ చేసిన కేసీఆర్.. ఎందుకబ్బా..?

Chakravarthi Kalyan
కేసీఆర్.. మరోసారి మాట తప్పారు.. మాట తప్పడం కేసీఆర్‌కు నిత్యకృత్యం కాకపోయినా.. అప్పుడప్పుడు ఆయన కూడా మాట తప్పుతారు.. ఈ విషయాన్ని ఆయన మరోసారి రుజువు చేశారు. రెండు రోజుల పాటు వరుసగా ప్రెస్ మీట్లు నిర్వహించిన కేసీఆర్.. హ్యాట్రిక్ కొడతానని చెప్పి మరీ హ్యాట్రిక్ మిస్ చేశారు. ఆయన ముందుగా చెప్పకపోతే.. ఇది మిస్ కిందకు రాదు.. కానీ.. ఆయన ఇకపై రోజూ ప్రెస్ మీట్ పెడతానన్నారు. రేపు కూడా ప్రెస్ మీట్ ఉంటుంది కదా అన్నారు.. రేపటి నుంచి మీకు పండగే అని జర్నలిస్టులనుద్దేశించి అన్నారు.


అంతే కాదు.. ఇకమీదట జర్నలిస్టులకు ప్రగతిభవన్‌లోనే లంచ్ కూడా ఏర్పాటు చేస్తాను..ఇక పై రోజూ నేనే రంగంలోకి వస్తా అంటూ రెండు రోజుల పాటు ఊరించారు. అయితే.. మూడో రోజే ఆ మాటను పాటించలేదు. ఇకపై రోజూ ప్రెస్ మీట్ ఉంటుందన్న కేసీఆర్.. కేవలం రెండు రోజులకే ఆ మాట మరిచిపోతాడని జర్నలిస్టులు ఊహించలేదు. మంగళవారం కూడా ప్రెస్ మీట్ ఉంటుందని ఊహించారు. అయితే.. కేసీఆర్ మాత్రం తన మాటలను తానే లైట్‌ గా తీసుకున్నట్టున్నారు. ఎందుకో తెలియదు కానీ.. మూడో రోజు వరుసగా కేసీఆర్ ప్రెస్‌ మీట్ నడవలేదు.


మరి కేసీఆర్‌ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు.. రెండు రోజులకే ఆయన అలసిపోయారా.. లేక మరేదైనా ఆలోచించారా.. అనవసరంగా బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నానని మథనపడ్డారా.. లేక ఆయన ముందుగానే అంతా ఊహించినట్టు కేవలం హుజూరాబాద్ ఓటమి అంశం నుంచి దృష్టి మరల్చేందుకే రెండు రోజులు హడావిడి చేశారా.. ఈ విషయాలపై ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా మాట తప్పడం కేసీఆర్ కు కొత్తేమీ కాకపోయినా.. మరీ ఒకటి, రెండు రోజులకే తాను ఇచ్చిన మాటను తానే తప్పడం ఏంటన్న అభిప్రాయం కలుగుతోంది.


అయితే... అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. అతిగా ఏం చేసినా చెడుతుంది.. పాపం.. కేసీఆర్ కూడా ఈ విషయాన్ని గ్రహించారా.. అందుకే ఏపీ ఎంపీ రఘురామకృష్ణం రాజులా రోజూ ప్రెస్‌ మీట్ పెట్టడం వేస్ట్ అని భావించారా.. ఏమో.. ఆయన బుర్రలో ఏముందో.. మొత్తానికి మూడోరోజు కేసీఆర్ా దర్శనం ఇవ్వలేదు. మరి బుధవారమైనా ప్రెస్ మీట్ ఉంటుందా.. ఏమో..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: