వామ్మో.. చనిపోయిన మహిళకు రెండో డోస్ వ్యాక్సిన్.. చివరికి?

praveen
ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగుతోంది. అయితే ఇప్పటికే దాదాపుగా అందరూ కూడా వ్యాక్సిన్ విషయంలో అవగాహన పెంచుకుని స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇక ప్రజలకు వ్యాక్సిన్ ను మరింత చేరువ చేసేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. ఆరోగ్యకార్యకర్తలు అందరూ కూడా గ్రామాల్లో వ్యాక్సిన్ డ్రైవ్ లు నిర్వహించి ఇక ఇంటింటికి తిరుగుతూ టీకా అందించే విధంగా చర్యలుచేపడుతున్నారు ప్రభుత్వ అధికారులు. ఇలా ఇంటి ముంగిటకే వచ్చి వ్యాక్సిన్ వేసి పోతున్నారూ ఆరోగ్య కార్యకర్తలు.


ఆరోగ్య కార్యకర్తలు అందరూ ఇలా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా.. కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇప్పటికే ఒకేసారి ఒకే మహిళకు ఏకంగా రెండు డోసులు వ్యాక్సిన్ నిమిషాల వ్యవధిలో ఇవ్వడం.. లేదా ఒకే మహిళకు వేర్వేరు రకాల టీకాలు అందించడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఇక మరో ఇలాంటి నిర్లక్ష్యపు ఘటన బయటపడింది. సాధారణంగా ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత.. నిర్ణీత సమయంతర్వాత రెండవ డోసు వ్యాక్సిన్ వేయాలి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఆరోగ్య కార్యకర్తలు  నిర్ణీత సమయం తర్వాత రెండవ డోసు వ్యాక్సిన్ వేశారు.


 టీకా వేశారు కదా ఇక్కడ నిర్లక్ష్యం ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారు కదా. అయితే ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ వేసింది బ్రతికున్న మహిళకు కాదు చనిపోయిన మహిళకు. చనిపోయిన మహిళ ఇక్కడ రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకుంది. హైదరాబాద్లోని దమ్మాయిగూడ కు చెందిన కౌశల్య అనే 81 ఏళ్ల వృద్ధురాలు మే 4వ తేదీన వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకుని రెండు నెలల అనంతరం ఆమె అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలియక పోవడంతో రెండో డోస్ ఆ సమయం వచ్చింది అంటూ ఆరోగ్య సిబ్బంది కౌశల్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా ఆమె మరణించింది అంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. కాని కొన్ని రోజుల్లోనే కౌసల్య రెండో తీసుకున్నట్లుగా కుటుంబ సభ్యులకు  సందేశం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఘటన ఆరోగ్య సిబ్బందినిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది అని అంటున్నారుకొంత మంది జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: