ఉచితంగా భోజనం.. స్టాలిన్ మరో సంచలనం?
తాను పేదల ముఖ్యమంత్రి అన్న విషయాన్ని తన పాలనతోనే చాటి చెబుతున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు.
ఇప్పటికే పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు ఏకంగా ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలి అంటూ నిర్ణయం తీసుకొని సంచలనమే సృష్టించారు. ప్రజాధనాన్ని వృధా చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి తమిళనాడులో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్లి పోయాయి. ఇలా వరదలతో ఇబ్బందిపడుతున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్
అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో కి మంత్రులు ఎమ్మెల్యేలను పంపించడం కాదు స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. ఇక ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా పర్యటనలు కొనసాగిస్తున్నారు స్టాలిన్. అంతేకాదు బాధితులను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలోనే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు తగ్గే వరకు కూడా అమ్మ క్యాంటీన్ల ద్వారా అందరికీ ఉచితంగా ఆహారం అందించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక అమ్మ క్యాంటీన్ లను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారుసీఎం ఎంకే స్టాలిన్.