వైసీపీలో కొత్త ఎమ్మెల్సీలు ఎవ‌రో.. జ‌గ‌న్ ఇన్ని ట్విస్టులా...!

VUYYURU SUBHASH
ఏపీలో స్థానిక సంస్థ‌ల కోటాలో జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌లు అధికార వైసీపీ వ‌న్ సై డ్ కానున్నాయి. ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగే అన్ని స్థానాలు కూడా వైసీపీ యే గెలుచు కుంటోంది. ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని జిల్లా అయిన కృష్ణా జిల్లాలో ఎన్నిక‌లు జ‌రిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలో నే ప‌డ‌నున్నాయి. అయితే జిల్లా నుంచి ఎమ్మెల్సీల‌ను చేస్తాన‌ని గ‌తంలోనే ఇద్ద‌రికి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వ‌యంగా హామీ ఇచ్చారు. అయితే వీరికే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ప‌ద‌వులు ద‌క్కుతాయా లేదా ఇత‌ర నేత‌ల‌కు ద‌క్కుతాయా ? అన్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గానే ఉంది.

ఈ ఎన్నిక‌ల్లో జిల్లా లో ఉన్న ఎంపీ టీసీలు, జ‌డ్పీటీసీలు , కౌన్సెల‌ర్ల తో పాటు కార్పోరేట‌ర్లు ఓట్లు వేస్తారు. వ‌చ్చే నెల 10వ తేదీన ఎన్నిక‌లు వస్తాయి. ఇక ఎన్నిక‌ల‌కు ఈ నెల 16న నోటిఫికేష‌న్ రానుంది. ఇక జిల్లా లో టీడీపీ వాళ్ల‌కు అస్స‌లు బ‌లం లేదు. దీంతో వాళ్లు త‌మ క్యాండెట్ల‌ను పోటీలో నిలిపే ప‌రిస్థితి కూడా లేదు. ఈ లెక్క‌న చూస్తే ఎన్నిక‌లు వైసీపీకి ఏక‌గ్రీవం కానున్నాయి.

ఇక వైసీపీ నుంచి జ‌గ‌న్ ప్రోగ్రామ్ , రూట్ క‌న్వీన‌ర్ త‌ల‌శిల ర‌ఘురాంకు ఓ ఎమ్మెల్సీ ప‌ద‌వి ఖ‌రారు అయిన‌ట్టు చెపుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న కేబినెట్ ర్యాంకు ప‌ద‌విలో ఉన్నారు. అయితే ఆయ‌న త‌న‌కు ఎమ్మెల్సీ కావాల‌ని అడ‌గ‌డంతో జ‌గ‌న్ ఓకే చెప్పార‌ని అంటున్నారు. ఆయ‌న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. అలాగే మ‌రో ప‌ద‌వి బీసీల‌కు ఇచ్చే ఆలోచ‌న లో జ‌గ‌న్ ఉన్నార‌ట‌.

అయితే గ‌న్న‌వ‌రం నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామ‌చంద్ర రావు తో పాటు గ‌న్న‌వ‌రంలో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు కూడా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఆశిస్తున్నారు. వీరిలో యార్ల‌గ‌డ్డ కూడా క‌మ్మ కావ‌డంతో ఆయ‌న‌కు అవ‌కాశం లేన‌ట్టే.. ?  మ‌రి ఆ ఎమ్మెల్సీ దుట్టా కు వ‌స్తుందా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: