అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?
పెళ్లి చేసుకోకుండా ఒక అమ్మాయిని భార్యగా అద్దెకు తీసుకోవడం ఏంటి.. అలా అద్దెకు తీసుకున్న అమ్మాయి మానసికంగా శారీరకంగా కూడా భార్య లాగా ఉండటం ఏమిటి.. ఇలాంటివి ఆఫర్లు కూడా ఉన్నాయా అని ఆశ్చర్య పోతున్నారు కదా.. అయితే ఇది ఆఫర్ కాదు ఏకంగా ఒక వింత ఆచారం.. ఇది ఎక్కడో విదేశాల్లో అనుకుంటే మాత్రం పొరబాటే.. ఎందుకంటే ఇది మన దేశంలోనే. మన దేశంలో ఎవరికీ తెలియని కొన్ని వింత ఆచారాలు అప్పుడప్పుడు తెర మీదికి వస్తే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఒక వింత ఆచారమే ఇప్పుడు తెరమీదికి వచ్చింది.
మధ్యప్రదేశ్లో ఇక ఈ వింత ఆచారం కొనసాగుతోంది. శివపురి జిల్లాలో ఏకంగా అమ్మాయిలను భార్యలుగా అద్దెకిచ్చే దడిచా సంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయం ప్రకారం ధనవంతులు డబ్బులు ఇచ్చి నెల లేదా ఏడాది ఇలా అవసరాలు తీరే వరకు కూడా ఒక అమ్మాయిని భార్యగా అద్దెకు తీసుకుంటారు. దీనిపై ఇరు కుటుంబాలు స్టాంపు పేపర్లపై సంతకాలు కూడా చేస్తారు. ఇలా అద్దెకు వెళ్లిన మహిళా మానసికంగా శారీరకంగా వారితో భార్యగానే ఉండాలి. తక్కువ వయసున్న కూడా వారికీ అక్కడ డిమాండ్ ఎక్కువ డిమాండ్ ఉందట. పోలీసులు ఈ వింత ఆచారాన్ని మానుకోవాలని హేచ్చరించిన కూడా జనాలు తీరు మార్చుకోవట్లేదట.