కృష్ణా జిల్లా టీడీపీ నేతల అతి తెలివి చూశారా...!
ముఖ్యంగా కృష్ణా జిల్లా తమ్ముళ్ళు అదే బాటలో ముందుకెళుతున్నారు. కృష్ణా జిల్లాలో చాలామంది టీడీపీ నేతలు ఫుల్‌గా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఏదో అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో తప్ప, మిగిలిన సమయంలో పెద్దగా హడావిడి చేయడం లేదు. పరిస్తుతులకు తగ్గట్టుగా రాజకీయం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని నానిలకు పదవులు ఉండటంతో వీరు కాస్త ప్రజల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. ఆర్ధిక పరంగా కూడా బలంగానే ఉన్నారు కాబట్టి ఇబ్బందులు లేవు.
అలాగే కొల్లు రవీంద్ర, దేవినేని ఉమాలు సైతం ఎక్కువగా కనిపిస్తున్నారు. వారి వారి నియోజకవర్గాల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. అలాగే రాష్ట్ర పార్టీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. వీరిద్దరు యాక్టివ్ గా ఉండటానికి కారణాలు లేకపోలేదు. గత ప్రభుత్వంలో వీరు మంత్రులుగా పనిచేశారు. అందుకే కాస్త ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నారు. ఇక మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఇంచార్జ్‌లు మాత్రం ఏదో పార్టీ కార్యక్రమాల్లో తప్ప, నియోజకవర్గాల్లో నిత్యం తిరగడం లేదు.
దాదాపు జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి. నిత్యం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. అయితే ఇప్పుడు నుంచే హడావిడి చేస్తే ఆర్ధిక పరంగా ఇబ్బందులు పడతామనేది తమ్ముళ్ళ బాధ...అందుకే ఎన్నికల ముందు ఫుల్‌గా బరిలో దిగితే కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని, ఇప్పుడు హడావిడి చేయడం వల్ల ఉపయోగం ఉండదని కృష్ణా తమ్ముళ్ళు భావిస్తున్నట్లు తెలుస్తోంది.