విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది : జగన్

Veldandi Saikiran
తిరుపతి: దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. తిరుపతిలోని తాజ్‌ హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, కర్ణాటక సీఎం శ్రీ బసవరాజు బొమ్మై సహా లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు, అధికారులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు సీఎం వైయస్‌.జగన్‌. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలి.. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు  సీఎం వైయస్‌.జగన్‌.


 
రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదని.. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు  సీఎం వైయస్‌.జగన్‌.  వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం.. పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు  సీఎం వైయస్‌.జగన్‌.
విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని.. రీసోర్స్‌ గ్యాప్‌నూ భర్తీచేయలేదు.. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని పేర్కొన్నారు  సీఎం వైయస్‌.జగన్‌.

 
తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలను ఇప్పించండి.. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వండి.. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదన్నారు  సీఎం వైయస్‌.జగన్‌. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారని.. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రాల్లో రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదన్నారు  సీఎం వైయస్‌.జగన్‌.
వెంటనే సరవణలు చేయాలని..సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

ఇవే కాకుండా విభజనకు సంబంధించి అనేక అంశాలు ఇంకా అమలు చేయాల్సి ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని తప్పకుండా ప్రస్తావించాల్సి ఉంది. అదే ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’. ఆ హామీ, నిబంధనతోనే రాష్ట్ర విభజన జరిగింది. అయితే ఏళ్లు గడిచినా, ఎంతో కీలకమైనా ఆ హామీని మాత్రం ఇప్పటికీ నెరవేర్చలేదు. అదే విధంగా విభజన చట్టంలోని 8వ షెడ్యూల్‌ ప్రకారం, 8 మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, జాతీయ ప్రాధాన్యం ఉన్న 11 సంస్థలను పూర్తి స్థాయిలో 2024 నాటికి ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు  సీఎం వైయస్‌.జగన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: