కుప్పం : మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఉద్రిక్త‌త

N ANJANEYULU
కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ, అధికార వైసీపీ నేత‌ల మ‌ధ్య టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. కుప్పం మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం  25వార్డులు ఉండగా.. ఇప్పటికే  7వ వార్డు వైసీపీ ఏకగ్రీవం చేసుకున్న‌ది. మిగిలిన 24 వార్డులకు ఇవాళ ఉద‌యం 7 గంట‌ల‌ నుంచి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే రెండు పార్టీల నేత‌లు హోరాహోరీగా ప్ర‌చారం నిర్వ‌హించారు కుప్పంలో. రాష్ట్రం మొత్తం మున్సిప‌ల్ ఎన్నిక‌లు ఒక ఎత్త‌యితే.. కుప్పం ఎన్నిక‌లు మ‌రొఎత్తులాగా మారాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం కావ‌డంతో ఈ ఎన్నికలు ఆస‌క్తిక‌రంగా మారాయి.

టీడీపీ నేత సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే వైసీపీ అభ్య‌ర్థి ఒక వార్డును ఏక‌గ్రీవంగా ఎన్నిక కావ‌డంతో టీడీపీ నేత‌లు దాదాపు 20 రోజుల‌కు పైగా కుప్పంలోనే పాగా వేసి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. తాజాగా 50 మంది ఓట‌ర్లు 16వ వార్డు వ‌ద్ద‌కు దొంగ ఓట్లు వేయ‌డానికి వ‌చ్చారని స‌మాచారం. దొంగ ఓట్లు వేయ‌డానికి వ‌చ్చిన వారిపై  16వ వార్డు టీడీపీ ఏజెంట్ వాగ్వాదానికి దిగాడు. పోలింగ్ బూత్ నుంచి త‌మ‌ను బ‌య‌ట‌కు పంపుతున్నార‌ని నిర‌స‌న చేప‌ట్టారు. పోలింగ్ బూత్ వ‌ద్ద‌కు ఎంపీ రెడ్డ‌ప్ప‌, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ శ్రీ‌నివాసులు పోలింగ్ బూత్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. కేవ‌లం టీడీపీకి చెందిన ఏజెంట్‌ను బ‌య‌టికి పంపించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

పంపించితే అంద‌రినీ బ‌య‌ట‌కు పంపించాలి. టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌కు కూడ దిగారు. దొంగ ఓట్లు వేయ‌డానికి వ‌చ్చిన వారిని పంపించిన‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా వైసీపీ త‌రుపున పోటీ చేసే అభ్య‌ర్థి సుధీర్ గెలిస్తే చైర్మ‌న్ అయ్యే అవ‌కాశాలు ఉండ‌డంతోనే  ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. అన్ని వార్డుల కంటే ఈ వార్డులో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. మ‌రోవైపు పోలీస్ అధికారులు మాత్రం దొంగ ఓటు వేసిన‌ట్టు మాకు ఎవ్వ‌రూ ఫిర్యాదు చేయ‌లేదు. కేవ‌లం గుంపులుగా వ‌చ్చిన వారిని మాత్రం పంపించామ‌ని పేర్కొన్నారు. అయితే ఈ త‌రుణంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుప్పంకు వ‌స్తార‌ని అంద‌రూ ఆశించారు. అయితే ఇప్ప‌టికే చంద్ర‌బాబుపై వైసీపీ నేత‌లు ఎస్ఈసీకి ఫిర్యాదు చేసార‌ని.. చంద్ర‌బాబు కుప్పం టూర్ ర‌ద్ద‌యిన‌ట్టు తెలుస్తోంది.

1

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: