ఎమ్మెల్సీ అభ్యర్థులకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఆరు ఎమ్మెల్సీ సీట్లకుగాను ఏడుగురికి ప్రగతి భవన్ నుంచి పిలుపు అందినట్లుగా తెలుస్తోంది. రేపే నామినేషన్ దాఖలుకు చివరి రోజు కావడంతో ఇవాళ సాయంత్రానికల్లా తుది జాబితాను విడుదల చేసేందుకు టిఆర్ఎస్ అధిష్టానం కసరత్తు వేగవంతం చేసింది. అయితే మధుసూదనాచారి కి ప్రగతి భవన్ నుండి పిలుపు రాలేదని తెలుస్తోంది. ఆయనకు గవర్నర్ కోటాలో అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ లో ఎవరిని ప్రకటించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. నిన్న రాత్రి వరకు కూడా సమీక్ష సమావేశం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎవరిని ప్రకటించాలనే దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతున్న పరిస్థితి ఉంది.
ఆశావహుల ను బుజ్జగించే పనిలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు తో పాటు కేటిఆర్ కూడా ఉన్నారు. గతంలో ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చాలామందికి హామీ ఇవ్వడంతో ఈసారి ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరికి ఇవ్వబోతున్నారనేదానిపై కూడా ఒక స్పష్టత లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆశావహులు ఉదయం నుంచి ప్రగతి భవన్ కు వచ్చిన పరిస్థితి ఉంది. ఏడుగురి ని పిలిచినా ఎవరిని ఫైనల్ చేస్తారనే దానిపై ఆసక్తి రేపుతోంది. మాజీ స్పీకర్ మధుసూదనాచారి కి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ లో అవకాశం దొరకలేదని గవర్నర్ కోటా లో అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరికొద్ది సేపట్లో ఈ ఆరు స్థానాలకు సంబంధించి ఎవరెవరిని ఫైనల్ చేయబోతున్నారో, ఎవరి పేరు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఖరారు చేయబోతుందనేదానిపై మరికొద్ది సేపట్లో ఒక స్పష్టత రానుంది. ప్రస్తుతానికి ఏడుగురు ఆశావాహులు ప్రగతి భవన్ లో ఉన్నారు. రేపు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కూడా ఉండడంతో మరికొద్ది సేపట్లో ఎవరెవరిని ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తారో అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ప్రగతి భవన్ కి ఎవరినైతే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించనున్నారో వారందరూ కూడా చేరుకున్నారు. అందులో ఎవరెవరికి అవకాశం కల్పిస్తారని దానిపై కూడా ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది.