పాకిస్తాన్ లో పాత కథే పునరావృతం అవుతోంది. ఎప్పట్లాగానే ప్రధానిపై ఆర్మీ కి కోపం వచ్చింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధంమైంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కొత్త చీఫ్ గా లెఫ్ట్నెంట్ జనరల్ నదీమ్ అంజామ్ నియామకం ప్రధాని పదవికి గండం తెచ్చింది. ఇమ్రాన్ ఖాన్ స్థానంలో కొత్త ప్రధాని ఎంపికకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వారం రోజుల్లోపు ఈ మొత్తం వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ రాజ్యాంగేతర శక్తి. పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లోనే ఉంటుంది. అధికారంలో ఏపార్టీ ఉన్న సైన్యాధ్యక్షుడు చెప్పినదానికి తలడించాల్సిందే. కాదు అంటే ప్రభుత్వాలు మారి పోవాల్సిందే. అసలు ఆర్మీ ప్రమేయం లేనిదే అక్కడ ఏమీ జరగదు.
ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొంది మూడేళ్ల నుంచి పదవిలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై పాక్ ఆర్మీ కి కోపం వచ్చింది. నవంబర్ 20 లోపు పదవికి రాజీనామా చేయాలని లేదంటే తామే తప్పించగలమని అల్టిమేటం జారీ చేసింది. కొంతకాలంగా ఆర్మీకి ప్రధానితో పొసగడం లేదు. ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజమ్ ను ఆర్మీ చీఫ్ నియమించడం ఈ విభేదాలు తారాస్థాయికి చేర్చింది. ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ బజ్వా, నదీం అంజమ్ కు అనుకూలంగా ఉండగా ప్రస్తుత ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయీజ్ అహ్మద్ కు ఇమ్రాన్ మద్దతిస్తున్నారు. ఆర్మీ అధిష్టానానికి ఇమ్రాన్ ఖాన్ గౌరవం ఇవ్వడం లేదన్న అభిప్రాయంలో భజ్వ ఉన్నారు. నదీం అంజనమ్ పదవీ బాధ్యతలు స్వీకరించే లోపు ప్రధాని మార్పు జరిగిపోవాలని భావిస్తున్నారు.
ఏప్రిల్లో అరెస్టైన టి ఎల్ పి అధ్యక్షుడు సాధ్ రిజ్విని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని వారాలుగా టి ఎల్ పి దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఈ ఆందోళనలో హింసాత్మక రూపు దాల్చడంతో అనేక మంది పోలీసులు చనిపోయారు. దీంతో గత వారం టి ఎల్ పి ప్రతినిధులతో చర్చలు జరిపిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేర్చేందుకు బలవంతంగా అంగీకరించింది. ఈ పరిణామాలన్నింటినీ అనుకూలంగా మార్చుకున్న ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు వేగవంతం చేసింది.