జగన్.. ఇప్పటికైనా నిజాలు చెప్పు.. ప్లీజ్..?
ఏపీ తమకు చెల్లించాల్లిన అప్పులను రాబట్టుకునేందుకు ఢిల్లీ నుంచి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు రాష్ట్రానికి వచ్చారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అధికారులు రాష్ట్రానికి అప్పులు వసూళ్లకు వస్తున్నారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని.. కనీసం ఇన్ స్టాల్ మెంట్స్ కట్టకుండా పెండింగ్ పెట్టారని పయ్యావుల కేశవ్ వంటి నేతలు ఆరోపిస్తున్నారు.
ఇలా పెండింగ్ పెట్టడం వల్ల ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ గా మారిపోయాయని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం తాను చేసిన అప్పులను దేశం గుర్తించేలా చేసిందంటున్న పయ్యావుల కేశవ్.. ఓ ప్రభుత్వం వద్దకు సంస్థ ప్రతినిధులు అప్పుల వసూళ్ళ కు వస్తున్నారంటేనే ఏపీ ఆర్థిక పరిస్తితి కుప్పకూలిందని అర్థం అవుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పుల వసూళ్లకి ఢిల్లీ నుంచి వస్తున్నారు అంటే పరిస్థితి చేయిదాటి పోయిందని తెలిసిపోతోందని పయ్యావుల కేశవ్ అంటున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందని.. అందుకే కేంద్రం ఇప్పటికైనా రాష్ట్ర పరిస్థితి బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు పయ్యావుల కేశవ్. కేంద్ర ప్రభుత్వ పాలకులకు రాష్ట్ర ప్రభుత్వం తో సంబంధాలు ఉన్నాయని.. ఆర్థిక మంత్రి బుగ్గన ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్..ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళుతున్నారు.. వాస్తవాలు చెప్పండని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేస్తున్నారు.