పెద్దిరెడ్డికి పంచ్ త‌ప్ప‌దా... వైసీపీలో ఇదే హాట్ టాపిక్‌..!

VUYYURU SUBHASH
ఔను.. ఇప్పుడు వైసీపీలో ఇదే మాట వినిపిస్తోంది. వైసీపీలో కీల‌క నాయ‌కుడిగా.. సీనియ‌ర్‌గా.. మంత్రిగా.. అంత‌కు మించి.. షార్ప్ షూట‌ర్‌గా గుర్తింపు పొందారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గ‌త కొన్నాళ్లుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున అన్నీతానై ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తిరుప‌తి పార్లమెంటు ఉప పోరును గెలిపించుకున్నారు. అదేవిధంగా బ‌ద్వేల్‌లోనూ.. సీటును సుస్థిరం చేశారు. స్థానిక‌, కార్పొరేష‌న్‌.. పంచాయ‌తీ.. ఇలా అన్ని ఎన్నిక‌ల్లోనూ.. వైసీపీని గెలిపించిన నాయ‌కుడిగా రామ‌చంద్రారెడ్డికి పేరుంది. అయితే.. ఇప్పుడు అదే నాయ‌కుడు.. కీల‌క‌మైన యుద్ధం చేశార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

చిత్తూరులోని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గం కుప్పం మునిసిపాలిటీ ఎన్నిక జ‌రిగింది. దీనిని రామ‌చంద్రారెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇక్క‌డ చంద్ర‌బాబు పార్టీని ఓడించి.. వైసీపీని గెలిపించి..కుప్పం మునిసిపాలిటీలో వైసీపీ జెండాను ఎగ‌రేసి.. స‌త్తా చాటుతాన‌ని.. చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త పెరిగింద‌న‌డానికి దీనినేరుజువుగా చూపిస్తాన‌ని కూడా.. పెద్దిరెడ్డి శ‌ప‌థం చేశారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న పాద‌యాత్ర కూడా చేశారు. ఇంటింటికీ తిరిగారు. అభ్య‌ర్థుల ఎంపిక నుంచి నామినేష‌న్ల వ‌ర‌కు కూడా అన్నీతానై వ్య‌వ‌హ‌రించారు. ఇది పార్టీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మే కాకుండా.. స్వ‌యంగా వ్య‌క్తిగ‌తంగా కూడా.. పెడ్డిరెడ్డి నాయ‌క‌త్వానికి కూడా స‌వాలుగా మారింది. ఎలా అంటే.. ఇక్క‌డ ఆయ‌న ఒక్క‌డే కాకుండా.. ఆయ‌న కుమారుడు, ఎంపీ.. మిథున్‌రెడ్డి కూడా ప్ర‌చారం చేశారు. ప్ర‌జ‌ల‌ను క‌లిశారు. సో.. ఇన్ని చేసిన త‌ర్వాత‌.. కుప్పంలో గెల‌వ‌క‌పోతే.. ఏంటి? అనే ప్ర‌శ్న స‌ర్వ‌సాధార‌ణంగా వినిపించేదే. అయితే.. ఎన్నిక‌లకు ముందు వ‌ర‌కు ఉన్న ఆశ‌లు.. త‌ర్వాత త‌గ్గుముఖం ప‌ట్టాయి.

ఎన్నిక‌ల‌కుముందు రోజు వ‌ర‌కు మేమే గెలుస్తాం.. అన్న నాయ‌కులు.. ఎన్నిక‌ల రోజు.. ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చి ప్ర‌తిఘ‌టించారు. దొంగ ఓట్టు వేయిస్తున్నారంటూ.. పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో ఎన్నిక‌ల్లో పోలింగ్ అనుకున్న విధంగా సాగ‌లేదు. దీనిని బ‌ట్టి వైసీపీ అంచ‌నాలు తారు మారు అవుతాయా? అనే లెక్కులు కూడా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ ఏమైనా తేడా వ‌స్తే.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఇప్ప‌టి వ‌ర‌కు సంపాయించుకున్న హ‌వా మొత్తం పోయిన‌ట్టేన‌ని పెద్దిరెడ్డి గురించిన కామెంట్లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: