అచ్చెన్న స్పీక్స్ : ఈ విజ‌యం డీజీపీకే అంకితం ఆహా!

RATNA KISHORE
ఎన్నిక ఏదయినా గెలుపు మాదే అని అంటాడు జ‌గ‌న్. అదే కాన్ఫిడెన్స్ తో మాట్లాడ‌తాడు సజ్జ‌ల. ఇలా మాట్లాడ‌డం వ‌ల్ల సాధించేదేమ‌యినా ఉందా అంటే ఏమో కానీ ఈ సారి టీడీపీ మాత్రం కాస్త కోలుకుంద‌నే చెప్పాలి. ముందు నుంచి ఎన్నో నిర్బంధాలు దాటి వ‌చ్చిన టీడీపీకి ఇదొక స‌వాలు. ఇదొక అనూహ్య ప‌రిణామం. అయిన‌ప్ప‌టికీ అచ్చెన్న మాత్రం వీలున్నంత వ‌ర‌కూ కార్య‌క‌ర్త‌ల‌కు ధైర్యం చెప్పారు.వీలున్నంత వ‌ర‌కూ శ‌క్తి మేర పోరాడాలి అని ఉద్బోధ చేశారు. అడుగడ‌గునా పెద్ది రెడ్డి రాజ్యం అమ‌లు అవుతున్నా  కూడా చాలా మంది ధైర్యం చేసి నామినేష‌న్ వేశారు. ఇంత‌టి అధికార దుర్వినియోగం తరువాత కూడా ద‌ర్శిలో మంచి విజ‌యం అందుకుంది టీడీపీ. కొండ‌ప‌ల్లి లో కూడా! కానీ ఇవేవీ విజ‌యాలు కానే కావ‌ని వైసీపీ ప్ర‌గ‌ల్బాలు ప‌లుకుతోంది.


12 మున్సిపాల్టీలు 1 కార్పొరేష‌న్ కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో  అత్య‌ధిక స్థానాలు మావే అని  ఊద‌ర‌గొడ్తోంది వైసీపీ. ఇది ఎలా ఉన్నా కూడా  ఈ గెలుపు మాత్రం ప‌క్కా డీజీపీకే అంకింతం ఇవ్వాల‌ని అంటున్నారు టీడీపీ బాస్ అచ్చెన్నాయుడు. ఇవాళ ఆయ‌న ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చాలా విశ్లేషణాత్మ‌కంగా మాట్లాడారు. ఆశావహ దృక్ప‌థంతో మాట్లాడారు. కుప్పంలో ఓట‌మిని ఫోకస్ చేయ‌డం త‌గ‌ద‌ని, ఓ మంత్రి స్థాయి వ్య‌క్తి త‌న‌ని తాను దిగ‌జార్చుకుని దొంగ ఓట్లు వేయించడం ప్ర‌జా స్వామ్య చరిత్ర‌లోనే లేనే లేద‌ని అంటూ తాము కుప్పం ఓట‌మిని ప‌ట్టించుకోమ‌నే అన్నారు. తాము ఎన్నో ఒడిదొడుకులు దాటుకుని ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచామ‌ని, త‌మ‌ను గెలిపించిన కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు పాదాభివంద‌నాలు చేస్తున్నామ‌ని అన్నారు.

ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే...


క‌మ‌లాపురం, ద‌ర్శి, బేతంచ‌ర్ల మున్సిపాల్టీలలో వైసీపీకి 49 శాతం టీడీపీకి 46 శాతం ఓట్లు వ‌చ్చాయి. అంటే మూడు శాతం ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది. ప్ర‌భుత్వ ప‌తనానికి ఈ ఎన్నిక‌లే నాంది. ప్ర‌జ‌ల తిగుబాటు ఇది. ఏడు మున్సిపాల్టీల్లో హోరా హోరీ పోరు సాగింది. రెండింట విజ‌యం మాదే! మరొక‌టి కూడా మా ఖాతాలోనే! చేత‌నైతే మంత్రి వెల్లంప‌ల్లి రాజీనామా చేయాలి. గెలిస్తే తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేస్తాం.క‌న్ను పోయి లొట్ట మాదిరిగా గెలుపు ఇది. అంటూ అచ్చెన్న ఫైర్ అయ్యారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: