చంద్రబాబును తీసుకురండి చూడాలని ఉంది : సీఎం జగన్

praveen
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇటీవలే మొదలయ్యాయి. ఇటీవలే ఉప ఎన్నికల్లో గెలిచిన సుధా ప్రమాణ స్వీకారం తో ఈ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ క్రమంలోనే పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలపై చర్చించాలని టిడిపి కోరగా టిడిపి వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అంతే కాకుండా ఇటీవలే మరణించిన ఎమ్మెల్యేలకు సభా వేదికగా సంతాపం తెలిపారు. ఇక ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బిఎసి సమావేశం నిర్వహించారు. కేవలం ఒక్కరోజు మాత్రమే సభను నిర్వహించాలని ముందుగా ప్రభుత్వం భావించింది. కానీ ఈ నెల 26 వరకు కూడా ఈ సెషన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.



 అయితే ఇటీవలే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన అసెంబ్లీ బీఏసీ సమావేశం జరిగగా.. ఇక ఈ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా ఇటీవలే వెలువడిన కుప్పం నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఏసీ సమావేశం లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు చంద్రబాబును తీసుకురావాలని డిమాండ్ చేసారూ. కుప్పం ఫలితాల తర్వాత చంద్రబాబు ముఖాన్ని ఒకసారి చూడాలని ఉంది అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమే అంటూ చెప్పుకొచ్చారు.. అయితే చంద్రబాబు సభకు కచ్చితంగా వస్తారు అంటూ వ్యాఖ్యానించారు అచ్చెన్నా.



 అదే సమయంలో ఇక బీఏసీ సమావేశంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ప్రస్తావన ఎందుకు తీసుకు వస్తున్నారు అన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు అచ్చన్నాయుడు. ఈ క్రమంలోనే మాట్లాడిన సీఎం జగన్ చంద్రబాబు సభకు వచ్చేలా అదికూడా ఒక్కసారి కాదు దాదాపు రెండు సార్లు వచ్చేలా చూడాలి అన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. కుప్పం నియోజకవర్గం గురించి మాట్లాడేందుకు చాలా ఉన్నాయి అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇలా బీఏసీ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ను సభకు పిలిస్తే ఒకసారి ఆయన ముఖం చూడాలని ఉంది అంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: