బ్రేకింగ్: అమిత్ షా క్లాస్ తో లైన్లోకి వచ్చిన సోము

praveen
గత కొంత కాలం నుంచి ఏపీ రాజకీయాల్లో ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా ఎన్నికలు రావడం ఇక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇంత జరుగుతున్న అటు బీజేపీ మాత్రం కాస్త సైలెంట్ గా నే ఉంటూ వస్తోంది. అటు ఏపీ లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఆ స్థాయిలో దూకుడుగా మాత్రం ముందుకు సాగడం లేదు . ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ సోము వీర్రాజు మాత్రం గత కొంత కాలం నుంచి అధికార పార్టీ తీరును ఎండగట్టడంలో వ్యూహాత్మకంగా వ్యవహ రించడం లేదు.

 ఈ పరిణామాల నేపథ్యంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు బిజెపి పెద్దగా ఉన్న అమిత్ షా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోము వీర్రాజు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్లాస్ పీకిన ట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాస్త దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ ఎస్ సి మోర్చా రాష్ట్ర ప్రధాన అధికారులు, జిల్లా అధ్యక్షులతో సమావేశం జరిగింది.. సమావేశానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

 అమరావతి రైతుల పోరాటానికి బిజెపి ఎప్పుడు మద్దతు ఇస్తుంది. 21వ తేదీన రైతుల పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న పోతున్నాను అంటూ సోము వీర్రాజు ప్రకటించారు. అమరావతి అభివృద్ధిలో వెనక అడుగు వేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు  వేసిన ప్రతి అడుగు లో కూడా తమ మద్దతు ఉంటుంది అంటూ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ఇక మచిలీపట్నం నుంచి నెల్లూరు వరకు కూడా దళిత మోర్చా నేతలు కార్యకర్తలు అందరూ కూడా ఈ పోరాటం లో పాల్గొనాలి అంటు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎస్సీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎస్సీలకు కేబినెట్లో స్థానం కల్పించిన ఘనత బీజేపీదే అంటూ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి లోనే ఉండాలి అనే విషయం బీజేపీ చెబుతోంది. అమరావతి చుట్టూ అభివృద్ధి చేసింది కేంద్రం కాదా అంటూ సోము వీర్రాజు ప్రశ్నించారు. కేంద్రం ఏపీకి వేల కోట్ల నిధులు ఇస్తే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం చేస్తుంటే మరి  సీఎం జగన్ ఏం చేస్తున్నారు. మా పథకాలను మీ పథకాలుగా చెప్పుకోవడమే అంటూ ప్రశ్నించారు సోము వీర్రాజు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: