ఇంస్టాలో ఖాతా తెరవాలంటే.. ఇక అది కావాల్సిందే?
ప్రస్తుతం సామాన్యులదగ్గర నుంచి సెలబ్రిటీలు రాజకీయ నాయకుల వరకు కూడా అందరూ.. ఇంస్టాగ్రామ్ యూజర్లు గానే కొనసాగుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన యూజర్లకుమరింత నాణ్యమైన సర్వీసులను అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త రీతిలో ఫీచర్లు తీసుకు వస్తూ ఉంటుంది ఇంస్టాగ్రామ్. అయితే ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ రూల్స్ బాగా వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇంస్టాగ్రామ్ కారణంగా ప్రస్తుతంఅందరూ ఎంతగానో ఎంటర్టైన్ అవుతున్నారు. అయితే ఇటీవలే ఇంస్టాగ్రామ్ కొత్త యూజర్ లందరికీ కూడా ఒక కొత్త నిబంధన అమలులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం యూత్ ని ఎక్కువగా ఆకర్షిస్తున్న ఇంస్టాగ్రామ్ లో డెవలపర్లు కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకురాబోతున్నారు. ఇకపై ఎవరైనా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే వారి సెల్ఫీ వీడియో అప్లోడ్ చేయాలి. ఒక వేళ ఇలా చేయకపోతే ఇక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అవ్వదు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ తో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లో ఓపెన్ చేయలేరు. తద్వారా ఇంస్టాగ్రామ్ లో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్ క్రియేట్ చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారికి చెక్ పెట్టాలని ఇంస్టాగ్రామ్ డెవలపర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.