కొత్త వ్యవసాయ చట్టాలతో అనర్థమేనా.. రైతు బజార్ల పరిస్థితి ఏంటి..?

MOHAN BABU
రైతులు పండించిన పంటను దళారుల చేతిలో పెట్టకుండా నేరుగా అమ్ముకునేందుకు గత ప్రభుత్వం రైతు బజారు ని ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రం చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు వారు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, ఇతర పంటలను రోజువారీగా ఇక్కడకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఆదిలాబాద్ రైతు బజార్ లో 70 మంది వరకు రైతులు కూరగాయలు విక్రయిస్తే, అదనంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు 25 మంది వరకు అమ్ముతుంటారు. ప్రస్తుతం రైతుల నుంచి అభివృద్ధి ఛార్జీలు వసూలు చేయకపోయినా స్వయం సహాయక సభ్యుల నుంచి మాత్రం రోజువారీగా రూ. 50 వసూలు చేస్తున్నారు.


 ఈ సభ్యులు సొంతంగా పండించడం కాకుండా బీట్ నుంచి కొనుగోలు చేసి రైతు బజార్ కు తీసుకువచ్చి అమ్ముతుంటారు. కుటుంబ పోషణ కోసం ఈ సంఘం సభ్యులు చాలా రోజుల నుంచి కూరగాయలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదనపు భారం మోపడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇది వరకు రైతుబజార్ నిర్వహణ కోసం ప్రతి ఏటా 8 లక్షల రూపాయల వరకు నిధులు కేటాయించేది. కేంద్రం కొత్తగా వ్యవసాయ చట్టాలను తీసుకు రావడంతో రైతులకు ఎక్కడైనా విక్రయించుకోవచ్చని ప్రకటించింది. దీంతో మార్కెట్ కు నిధుల కేటాయింపులో ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెల నుంచి పూర్తిగా నిలిపివేసింది.


 దీంతో మార్కెటింగ్ అధికారులు నిర్వహణ చార్జీలను చిరు వ్యాపారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇలా చిరు వర్తకుల నుంచి అభివృద్ధి ఛార్జీలు వసూలు చేస్తున్న అధికారులు రైతుబజార్లో ఆమేరకు సౌకర్యాలు మాత్రం లేదు. ఇప్పటికే వ్యవసాయ చట్టాల అమలు కారణంగా ఆదిలాబాద్ పత్తి మార్కెట్ కు ఆదాయం రాకుండా పోయింది. దీంతోపాటు రైతు బజార్ పరిస్థితి కూడా దయనీయంగా మారుతోంది. ఈ విధంగా రైతులకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: