అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

praveen
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యం లో ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ తప్పని సరిగా మారి  పోయింది. ఈ క్రమం లోనే  ప్రపంచ దేశాలు అన్నీ కూడా తమ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించడం లో వ్యూహాత్మకం గా ముందుకు కదులు తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అగ్రరాజ్యాల్లో మళ్లీ కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్ లో అయితే కరోనా వైరస్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది అని  శాస్త్రవేత్తలు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటం గమనార్హం. ఇలాంటి హెచ్చరికల  నేపథ్యంలో.. ఇక వ్యాక్సిన్ తప్పనిసరిగా మారిపోయింది.



 అయితే ఇప్పటికే రష్యా బ్రిటన్ లాంటి దేశాలలో భారీగా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోవడంతో మళ్లీ లాక్డౌన్ విధించే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ చేసుకోవడం అన్నది ఎంతో కీలకం గా మారి పోయింది. అయితే అగ్రరాజ్యమైన అమెరికా లో దాదాపుగా అందరూ ఇప్పటికే రెండు డోసుల యాక్షన్ తీసుకున్నారు   అయితే రానున్న రోజుల్లో  కరోనా వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరికీ బూస్టర్ డోసు కూడా ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.


 అయితే మొన్నటి వరకు 65 ఏళ్లు పైబడిన వారికి, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి మాత్రమే బూస్టర్ డోసు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఎంతోమందికి బూస్టర్ డోసు అందించింది. కానీ ఇప్పుడు మాత్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా కోవిడ్ టీకా బూస్టర్ డోసులు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఫైజర్ మోడర్న బూస్టర్ డోసు లకు అనుమతి ఇచ్చింది. శీతాకాలం  వైరస్ కేసులు పెరగబోతున్నాయి అంచనా ప్రకారమే బూస్టర్డోస్ అందించడానికి అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: