ఏపీలో యేడాదిలోనే ఎన్నికలా... ఏం జరుగుతోంది..!
ఇప్పటికే రెండు బడ్జెట్ లను ప్రవేశపెట్టిన వైసిపి... కేవలం అంకెల గారడీతో మాయ చేస్తుందే తప్ప ఆశించిన రెవెన్యూ అయితే సాధించడం లేదు. ఇక జగన్ ఈ రోజు నుంచే వచ్చే ఎన్నికల టార్గెట్గా పెట్టుకుని యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు గా కనిపిస్తోంది. ఇక చంద్రబాబు తాజాగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను తీసుకుని ఆయన తాను ముఖ్యమంత్రి అయ్యేవరకు అసెంబ్లీ కి రాననే శపథం చేశారు. ఈ లెక్కన చూస్తే చంద్రబాబు కేవలం సీఎం పీఠమే లక్ష్యంగా రాజకీయం చేసేలా ఉన్నారు.
మరోవైపు వైసీపీ సైతం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాలు నమోదు చేయడంతో... ఒక ఏడాది ముందుగా ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో పాలన అభివృద్ధి అన్నది ఇప్పటికే కుంటు పడిపోయింది. కేవలం పూర్తిగా రాజకీయం , అధికారం అన్నదే పరమావధిగా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో ముందస్తు ఎన్నికల హడావిడి ఇప్పుడు ఉందని అధికార , ప్రతిపక్ష పార్టీ నేతలు చర్చించు కుంటున్నారు. మరి ఏపీ రాజకీయం ఎప్పుడు ? ఎలా ? మారుతుం దో ? చూడాలి.