కాసేపట్లో మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ.. దీనికోసమేనా..!

MOHAN BABU
మరికాసేపట్లో సీఎం కేసీఆర్ మంత్రులతో కీలక భేటీ కానున్నారు. ముఖ్యంగా ఈ ప్రగతి భవన్  అత్యవసర సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చ కొనసాగుతుందని తెలుస్తోంది. 12 మందిలో కొందరిని మార్చే అంశంపై చర్చ సాగనుంది. నామినేషన్లకు ఈనెల 23 వరకే గడువు ఉండడంతో ఈ భేటీలో అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ లో పదవీ కాలం పూర్తి అయి రెండు సంవత్సరాలు అయినవారు ఉన్నారు. రెండు సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన వారికి మెజారిటీగా మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని కొంత మంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నదని ప్రాథమికంగా తెలుస్తోంది.


ఏ జిల్లాలో అయితే నేతలను మార్చనున్నారో ఆ జిల్లాలలో ఆ యొక్క మంత్రులతో ఈ సమావేశంలో చర్చించనున్నారు కేసీఆర్. కొంతమంది తప్పించడం కోసమే ఈ సమావేశం నిర్వహించనున్నారని, వారి అభిప్రాయం సేకరిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా  కొంతమంది అభ్యర్థులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. వీరికి అసెంబ్లీలో అవకాశం కల్పించి మిగిలిన వారికి ప్రస్తుతం అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. మొన్న భర్తీ చేసినటువంటి ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించిన సమీకరణాలను  దృష్టిలో ఉంచుకొని, అలాగే ఇప్పటివరకు  అగ్రకులాలకు ఎక్కువ ప్రియారిటి ఇచ్చిన సీఎం కేసీఆర్, ప్రస్తుత ఈ 12 మంది  ఎమ్మెల్సీలలో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ప్రతి స్థానిక సంస్థల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు  ఎక్కువ మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి ఎక్కువగా జాగ్రత్త పాటించి ఇవన్నీ గెలుచుకునేందుకు వ్యూహాలు రచించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్లలో కాంగ్రెస్ పార్టీ బలం లేకున్నా పోటీ చేస్తామని నేపథ్యంలో ఈ బేటిలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ లిస్టులో కరీంనగర్ జిల్లాకు చెందిన భాను ప్రసాద్, ఇప్పటికే వీరు రెండు సార్లు ఎమ్మెల్సీలుగా కొనసాగారు. మళ్ళీ వారికి అవకాశం ఇచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే ఖమ్మం జిల్లాలో చూస్తే లక్ష్మీనారాయణ ఉన్నారు కానీ ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.


అందుకే మహబూబ్నగర్ జిల్లాలో చూసినప్పుడు నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి లు ఉన్నారు. కానీ ఇక్కడ కొత్తవారికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ అగ్రకులాల వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ స్థానంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నదని వీటిపైన ప్రధానంగా చర్చ సాగనుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: