షాకింగ్‌: సీజేఐ ఎన్‌.వి.రమణకు సత్యంబాబు లేఖ..?

Chakravarthi Kalyan
సత్యంబాబు.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా.. కొన్నేళ్ల క్రితం మీడియాలో మారుమోగిన పేరు.. కృష్ణా జిల్లాలో ఆయేషా మీరా అనే అమ్మాయి అత్యాచారం, హత్య కేసులో నిందితుగా మీడియాలో బాగా నానిన పేరు.. కానీ.. ఆ తర్వాత ఈ కేసు నుంచి సత్యంబాబు నిర్దోషిగా విడుదలయ్యాడు. అయితే.. ఈ కేసు విచారణ సమయంలోనే సత్యంబాబు తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆ సత్యంబాబు తాజాగా ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. ఆయేషా మీరా కేసులో చోటుచేసుకున్న పరిణామాలను లేఖలో తెలుపుతూ తనకు న్యాయం చేయాలని విన్నవించుకున్నాడు.


ఆయేషా మీరా కేసులో తనకు జరిగిన అన్యాయం, నష్టపోయిన జీవితకాలం, ఆరోగ్య సమస్యల గురించి సత్యంబాబు తన లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీజేఐ రమణ కూడా తమ ప్రాంతం నుంచే ఉన్నత స్థానాన్ని అధిరోహించారని సత్యంబాబు గుర్తు చేశాడు. మీరు అనేక వ్యవస్థలను మార్చడానికి కృషి చేస్తున్నారు.. మీకు నేను, ఆయేషా మీరా తల్లి పనిముట్లుగా మీ ప్రయోగ శాలలో ఉపయోగపడగలనని లేఖ రాయడం విశేషం.. తనను చేయని పాపానికి కేసులో ఇరికించారని..  తొమ్మిదేళ్లు కారాగార శిక్ష అనుభవించానని... నాకు ఇప్పటికైనా న్యాయం చేయాలని.. కాళ్లు చచ్చుబడిపోయిన తనను ఆదుకోవాలని సత్యం బాబు విన్నవించుకున్నాడు.


యేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు లేఖ రాసి.. దాన్ని ఢిల్లీలో సీజే కార్యాలయంలో ఇచ్చారు. ఆ లేఖ ప్రతిని పత్రికలకు కూడా విడుదల చేశారు. ఆయేషా మీరా హత్య కేసులో అసలు నిందితుల గురించి ఆమె తల్లి చెబుతున్నా పోలీసులు పట్టించుకోలేదని.. తనను బలి పశువును చేశారని సత్యంబాబు అంటున్నాడు. తనను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని.. తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని.. తనపై 9 అక్రమ కేసులు బనాయించారని అంటున్నాడు.


తనను చిత్రహింసలు పెట్టి మీడియా ముందు తనతో నేరం ఒప్పించారని.. అందువల్లే తనకు కోర్టు నాకు యావజ్జీవ శిక్ష విధించిందని.. ఆ తర్వాత తన పోరాటంతో 2017లో కోర్టు తనను  నిర్దోషిగా ప్రకటించిందని గుర్తు చేశారు. 10 ఏళ్ల జీవిత కాలాన్ని పోగొట్టుకున్న నేను నష్టపరిహారానికి అర్హుడినంటున్నాడు సత్యంబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: