ఎంచ‌క్కా ' సెటిల్ ' అయిపోయిన గోదావ‌రి జిల్లా మంత్రి..?

VUYYURU SUBHASH
ఆయ‌న గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఓ మంత్రి. ఏపీ సీఎం జ‌గ‌న్ కు అత్యంత ఇష్ట‌డు, బాగా న‌మ్మ‌కం అయిన వ్య‌క్తి. అందుకే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న ప‌ద‌విలో ఉన్నా కూడా జ‌గ‌న్ మ‌రోసారి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప మెజార్టీ తో గెలిచారు. జ‌గ‌న్ కు ఇష్టుడు, సౌమ్యుడు కావ‌డంతోనే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. మ‌రో వైపు జ‌గ‌న్ త్వ‌ర‌లోనే త‌న కేబినెట్ లోని మొత్తం అంద‌రు మంత్రుల ను మార్చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

అస‌లు ఎమ్మెల్యేల ల‌కే కాదు.. చివ‌ర‌కు మంత్రులు కూడా నిధులు లేవు. వారు కూడా ఓ రూపా యి సంపాదించుకు నే ప‌రిస్థితి లేకుండా ఉంది. దీం తో ఆ మంత్రి అవినీతి, నిధుల దుర్వినియోగం, శాఖ ప‌ర‌మైన వ‌సూళ్ల‌కు పాల్ప‌డ‌కుండా సెటి ల్ మెంట్లు చేస్తూ నాలుగు రూపాయ‌లు వెన‌కేసు కుంటున్నార‌ట‌. ఈ విష‌యం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

త‌న ప‌రిధిలో ఎక్క‌డ భూ సెటిల్మెంట్ ఉన్నా కూడా ఆయ‌న టేకోవ‌ర్ చేస్తున్నారు. ముందుగానే ఆ సెటిల్ అయితే త‌న కు వ‌చ్చే వాటా ఎంతో మాట్లాడు కుంటున్నార‌ట‌. త‌న వాటాకు ఒక్క రూపాయి త‌గ్గినా కూడా ఆ భూ సెటిల్మెంట్ ముందుకు క‌ద‌ల‌ద‌ని చెప్పేస్తున్నార‌ట‌. ఆయ‌న‌కు ఇవ్వాల్సిన డ‌బ్బులు అన్ని ముడితే ఆ సెటిల్మెంట్ ఎంచ‌క్కా గొడ‌వ లేకుండా ముగుస్తుంద‌ట‌.

ఏదేమైనా స‌ద‌రు మంత్రి చాలా తెలివి అయిన వారు అని.. శాఖ‌లో వ‌సూళ్ల‌కు పాల్ప‌డ‌కుండా, అవినీతి చేయ‌కుండా ఇలా సెటిల్ అవుతున్నార‌ని స్థానికంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక త్వ‌ర‌లోనే త‌న మంత్రి ప‌ద‌వి కూడా పోతుంద‌ని డిసైడ్ అయిపోయిన ఆయ‌న కొత్త ఆదాయ మార్గాల కోసం ఈ దారులు వెతుక్కున్నార‌ని సొంత పార్టీ నేత‌లు చెవులు కొరుక్కుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: