ఎస్ 400 వచ్చేస్తోంది.. శత్రు దేశాల్లో వణుకు?

praveen
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రక్షణ రంగాన్ని పటిష్టం గా మార్చే విధంగా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్రరాజ్యాలతో సైతం దౌత్య పరంగా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది భారత ప్రభుత్వం. ఒకప్పుడు భారత ఆర్మీ కి ఆయుధాలు కావాలి అంటే కేవలం విదేశాలపై ఆధారపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు భారత రక్షణరంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో కి భారత ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తూ ఉండడంతో ఇక వరుసగా ఆయుధాలను తయారు చేసే ప్రయోగాలు నిర్వహిస్తు భారత అమ్ములపొదిలో చేరుస్తున్నారు.


 అదే సమయంలో విదేశాల నుంచి అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను కూడా కొనుగోలు చేస్తూ భారత త్రివిధ దళాలను కూడా అంతకంతకూ పటిష్టంగా మారుస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవల కాలంలో ఎన్నో నూతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలు క్షిపణులను కూడా భారత అమ్ముల పొదిలో వచ్చి చేరిపోయాయి. అయితే ఇటీవలే ఎస్-400 క్షిపణి భారత అమ్ములపొదిలో చేరబోతోంది. గత కొన్ని రోజుల నుంచి దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే.. ప్రపంచంలోనే ఏ యుద్ధ  విమానాన్ని అయినా సరే ఎంతో సులభంగా కూల్చి వేయగల అత్యంత అధునాతనమైన క్షిపణి వ్యవస్థ ఇది.



 అయితే అమెరికాకు చెందిన అటువంటి అత్యంత శక్తివంతమైన యుద్ధం ఎఫ్ 30 యుద్ధ విమానాన్ని కూడా ఈ క్షిపణి వ్యవస్థ నాశనం చేయగలదు అంటూ చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఈ క్షిపణి వ్యవస్థ ఏకంగా ఒకేసారి 72 క్షిపణులను ప్రయోగించే కలిగి ఉందట. అంతేకాదు ఏకకాలంలో 36 అణు సామర్థ్యం గల క్షిపణులను కూడా నాశనం చేయగలదట ఈ క్షిపణి వ్యవస్థ. అమెరికా రష్యా చైనాల తర్వాత 400 కిలోమీటర్ల పరిధిలో ఎస్-400 క్షిపణి వ్యవస్థను కలిగి ఉన్న నాలుగవ దేశంగా భారతదేశం నిలిచింది. అయితే ఈ ఏడాది చివరి నాటికి  s400 క్షిపణి వ్యవస్థ భారత అమ్ములపొదిలో చేయబోతోందట.  ఇలా భారత ఆర్మీ మరింత పటిష్టంగా మారిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: