తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్న బిజెపి ప్రభుత్వం తో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేసిన మాది మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించాలని కెసిఆర్ సర్వశక్తులు ఒడ్డారు. అయితే అక్కడ వ్యతిరేక ఫలితం వచ్చింది. హుజరాబాద్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక కేసీఆర్ తన తాజా ఢిల్లీ పర్యటనలో రెండు మూడు రోజుల పాటు అక్కడే మకాం వేసి మరీ తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. వేసవిలో బాయిల్డ్ రైస్ కొన మన్న ప్రకటన వచ్చింది. అది నిజమైన ప్రకటన కాదా అవునా అనేది ఢిల్లీలోనే తేల్చుకుంటామని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర మంత్రులతో పాటు అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కూడా కలిసి ఈ విషయంలో క్లారిటీ తీసుకుంటామన్న ధీమా తో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇక సాగు చట్టాన్ని వెనక్కి తీసుకోవడం, రైతుల విజయంగా అభివర్ణించిన కేసీఆర్ బీజేపీ చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఇక రైతు ఉద్యమంలో చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మరణించిన ఒక్కో రైతు కుటుంబానికి మూడు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. రైతులపై ఈ ప్రభుత్వం పెట్టిన దేశద్రోహం కేసులు కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏదేమైనా కేసీఆర్ దూకుడు చూస్తుంటే కేంద్రంతో ఆయన తాడోపేడో తేల్చుకునేందుకు ఎంతమాత్రం వెనుకాడటం లేదని క్లియర్ గా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఏమాత్రం స్కోప్ లేకుండా చేయాలని ఆయన కసితో ఉన్నారని అర్థమవుతుంది. మరి ఈ పోరులో కెసిఆర్ ఎంతవరకూ వెళ్తారో, ఏం చేస్తారో అన్నది మాత్రం ఈ రెండు సంవత్సరాల రాజకీయమే డిసైడ్ చేయనుంది.