జగన్ 2.0 : మా శ్రీకాకుళంను రాజధాని చేయండి ఏం కాదు!

RATNA KISHORE
మా ప్రాంతం అభివృద్ధిలో లేదు తీవ్ర‌మ‌యిన క‌ష్టాల‌లో ఉంది. కానీ మా ప్రాంతం ఇన్నేళ్లుగా ప‌ట్టింపు లో లేదు. కానీ మా ప్రాంతం గురించి  మా స్పీక‌ర్ ఏడుస్తారు. ఎందుకు అంటే సానుభూతి కోసం.. అంత‌కుమించి ఆయ‌న నుంచి కానీ మా నాయ‌కుల నుంచి కానీ మేం ఆశించేదేమీ లేదు గాక లేదు. 70 ఏళ్ల కు పైగా అనుభ‌విస్తున్న వెనుక‌బాటులో ఎవ‌రి వాటా ఎంత అన్న‌ది తేలిపోతే బాగుండు. ఉద్య‌మాల గ‌డ్డ‌పై మ‌రో ఉద్య‌మం వ‌స్తే బాగుండు. అది ప్ర‌త్యేక ఉత్త‌రాంధ్ర ఉద్యమం అయితే ఇంకా బాగుండు.

చాలా రోజుల కింద‌ట చాలా విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. స‌మైక్యాంధ్ర అన్న‌ప్పుడు లేదా వేర్పాటు త‌ప్ప‌దు అని అనుకుంటున్న‌ప్పుడు మాకెందుకు ఈ గొడ‌వ మ‌మ్మ‌ల్ని ఒడిశాలో క‌లిపేయండి అని అడిగారు కొంద‌రు శ్రీ‌కాకుళం మేథావులు.. అది వారి విజ్ఞ‌త. అది వారికి ఉన్న అవ‌గాహ‌న. లేదంటే ఆ రోజు ఉన్న స‌మాచారం అనుస‌రించి అటు గంజాం ప‌ర్లాకిమిడి ప్రాంతాల‌తో పాటు ఇటు మూడు జిల్లాల ఉత్త‌రాంధ్ర‌ను క‌లిపి ప్ర‌త్యేక‌మ‌యిన రాష్ట్రంగా ప్ర‌క‌టించ‌మ‌ని కూడా అడిగారు.


ఇప్పుడివ‌న్నీ ఎందుకు మాకూ ఓ రాజ‌ధాని కావాలి.. అది మా శ్రీకాకుళ‌మే కావాలి అని కోరుకోవ‌డం త‌ప్పు లేదు క‌దా! {{RelevantDataTitle}}