వరద బాధితులకు రూ.లక్ష పరిహారం ప్రకటించిన చంద్రబాబు

Veldandi Saikiran
జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో సా రి నిప్పు లు చెరి గారు. వరద వస్తుం దని హెచ్చరికలు వస్తున్నా ప్రభుత్వం అలసత్వాన్ని పదర్శించింది... పింఛా ప్రాజెక్టు తెగడం వల్ల అన్నమయ్య ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగిందన్నారు చం ద్ర బాబు. ఈ ప్రభుత్వ తీరు వల్ల గతేడాది కూడా ఫించా ప్రాజెక్టు తెగిందని... ప్రాజెక్టు నిర్వహణలో అలసత్వంగా ప్రదర్శించి ప్రజల ప్రాణాలు తీ శా రని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇవి జగన్ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హత్యలే... ప్రజలను కాపడవలసిన వారే చంపే వరకు వచ్చారని నిప్పులు చె రిగారు చంద్రబాబు. ఎల్జీ పాలిమర్స్ లొ చనిపొయిన వారికి కోటీ రూపాయలు ఇచ్చారని... ఇక్కడ మాత్రం ఐదు లక్షలు మాత్రం ఇచ్చారని ఫైర్‌ అయ్యా రు చంద్రబాబు. అలాగే... వరద బాధితులుకు టీడీపీ పార్టీ తరఫున లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటన చేశారు  నారా చంద్రబాబు నాయుడు..
ఈ సిఎం జగన్‌ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రాణాలు కొల్పొయారు.. కాపాడగలిగిన ప్రభుత్వం కాపాడలేకపొయిందని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు చంద్రబాబు.   మా వాలెంటీర్లు చక్కగా పనిచేశారని అంటున్నారు.. ఏం చేశారు వాలెంటీర్లు.. ఎవరిని కాపాడారన్నారు చంద్రబాబు. అసెంబ్లీలొ ఎదైనా మాట్లాడితే మా నోరు మూయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇది అరంభం మాత్రమేనని వార్నింగ్‌ ఇచ్చారు చంద్రబాబు..  ప్రజాక్షేత్రంలో ఉంటాం... ప్రజాసమస్యలతొ పోరాడతామని స్పష్టం చేశారు చంద్రబాబు. ఎల్జీ పాలిమర్స్ మృతులకు ఇచ్చిన విధంగా చెయ్యేరు మృతులకు కోటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు  తెలుగు దేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు. ఇక నుంచి ప్రభుత్వాన్ని వదల బోమని వార్నింగ్‌ ఇచ్చారు తెలుగు దేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: