బస్తాలు మోసిన ఎమ్మెల్యే.. ఫోటో వైరల్?

praveen
గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తడిసి ముద్దవుతుంది అని చెప్పాలి. ఊహకందని విధంగా వచ్చిన భారీ వర్షాలు  ఒక్కసారిగా ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ జనజీవనాన్ని స్తంభింపజేసాయ్ అని చెప్పాలి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో అయితే భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల తో పరిస్థితులు అధ్వాన్నంగా మారిపోయాయి. జనావాసాల్లోకి నీరు వచ్చి చేరడంతో వరద ప్రభావానికి  ఇళ్లకు ఇల్లే కొట్టుకుపోయిన పరిస్థితి. అంతే కాదువరద నీటి లో చిక్కుకొని ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

 అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. అయితే వరద ప్రభావం తగ్గి ఇక సాధారణ పరిస్థితులు వచ్చేంతవరకు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇటీవల సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇక వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు నిత్యావసర సరుకులు అందించేందుకు ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.  ఇటీవలే తిరుపతిలోని రాయల చెరువు సమీపంలో వరద ముప్పు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగంలోకి దిగారు.

 వరద బాధితులకు నిత్యావసరాలు అందించడం కోసం హెలికాప్టర్ లో పది టన్నుల నిత్యావసర సరుకులు వస్తే.. అయితే ఈ సరుకులను  స్వయంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి తన సహచరులతో కలిసి హెలికాప్టర్ నుంచి కిందకు దించి వరద బాధితులకు అందజేశారు. ప్రస్తుతం వరదల నేపథ్యంలో ఏ వ్యక్తి కూడా నిత్య అవసరాలు అందక ఆకలితో అలమటించే కూడదని ఏ ఒక్కరికి ప్రాణహాని కాకూడదు అని జగన్ ఆదేశాలు జారీ చేశారని సీఎం ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాము అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: