దేవినేని ఉమాలో ఈ కొత్త హుషారుకు కారణమేంటి..!
అప్పటినుంచి దేవినేని ఉమా కు రాజకీయంగా కష్టాలు మొదలయ్యాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉమా ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయన తన మాట ఎప్పుడు చెల్లుబాటు అయ్యేలా చూసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గా కూడా ఓడిపోవడంతో ఆయనకు సొంత పార్టీ నుంచే ఇబ్బందులు తప్పలేదు. అయితే కొద్ది రోజుల క్రితం ఉమా పై చిన్న చిన్న కేసులు నమోదు చేసిన జగన్ ప్రభుత్వం రాజమండ్రి జైలుకు తరలించింది.
కొద్దిరోజుల పాటు జైలులో ఉండి బయటకు వచ్చినా దేవినేని ఉమా లో ఇప్పుడు సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇందుకు కారణం ఆయన నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీ పై తెలుగుదేశం పార్టీ జండా ఎగరడమే. ఇబ్రహీంపట్నం - కొండపల్లి మేజర్ పంచాయతీలను కలిపి ప్రభుత్వం కొండపల్లి మున్సిపాలిటీ గా ఏర్పాటు చేసింది. ఈ మున్సిపాలిటీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది.
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫీషియో ఓటుతో కొండపల్లి టిడిపి ఖాతాలో పడింది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న మూడు మునిసిపాలిటీలలో కొండపల్లి మున్సిపాలిటీ కూడా ఒకటి కావడంతో ఇప్పుడు ఉమా క్రేజ్ ఇప్పుడు పెరిగింది. అదే ఇప్పుడు ఆయన లో సరికొత్త ఉత్సాహానికి కారణమైంది.